బేకింగ్ సోడాని ఇలా చేసి వాడితే అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
సోడియం బైకార్బొనేట్ అనేది ఒక రసాయన పదార్థం. దీనిని మనం వాడుఁక భాషలో బేకింగ్ సోడా అంటాం. దీనిని ఇంట్లో చేసే వంటల కంటే బేకరీ ఉత్పత్తుల్లోనే ఎక్కువగా వాడుతుంటారు. వంట సోడాని కొన్ని ఆహార పదార్ధాల తయారీలో గుల్లబారి మృదువుగా వస్తాయని ఉపయోగిస్తారు. పలు స్వీట్స్, కేకుల తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించొచ్చు. కానీ దీన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. కారణం దీని ప్రయోజనాలు పూర్తిగా తెలియకపోవడమే. బేకింగ్ సోడాలో ఎన్నో ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు దాగున్నాయి. నేచురల్ డియోడరెంట్.. బేకింగ్ సోడాను సహజ డియోడరెంట్ గా కూడా ఉపయోగించొచ్చు.
ఎందుకంటే ఇది వాసనలను తటస్తం చేస్తుంది. దీనిలో కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ లా చేసి అండర్ ఆర్మ్స్ కు అప్లై చేయాలి. దీంతో వాసన రాదు. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, సున్నితమైన, మరింత ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి బేకింగ్ సోడాను ఎక్స్ఫోలియేటర్ గా ఉపయోగించొచ్చు. బేకింగ్ సోడాలో కొన్ని వాటర్ పోసి పేస్ట్ లా చేసి చర్మంపై మసాజ్ చేయండి. దంతాలు తెల్లగా ఉంటాయి.. బేకింగ్ సోడా సహజంగా దంతాలను తెల్లగా చేస్తుంది. ఇది కాఫీ, టీ, ఇతర ఆహారాల వల్ల అయిన మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది.
ఇందుకోసం బేకింగ్ సోడాలో కొన్నినీటిని కలిపి పేస్ట్ గా చేసి ఎప్పటిలాగే దంతాలను బ్రష్ చేయండి. వడదెబ్బ నుంచి ఉపశమనం.. మంట, చర్మంపై ఎరుపును తగ్గించడానికి కూడా బేకింగ్ సోడాను ఉపయోగించొచ్చు. బేకింగ్ సోడా వడదెబ్బకు గురైన చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కొన్ని నీళ్లను మిక్స్ చేసి పేస్ట్ ను ప్రభావిత ప్రాంతానికి అప్లై చేయండి. మొటిమలను తగ్గిస్తుంది.. బేకింగ్ సోడాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి.
దీన్ని పేస్ట్ లా చేసి మొటిమలపై అప్లై చేస్తే తొందరగా తగ్గిపోతాయి. పాదాల అలసట, దురద.. పాదాల అలసట, దురద వంటి సమస్యలను తగ్గించడానికి కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొన్ని టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను వేసి పాదాలను 15-20 నిమిషాల పాటు అందులో నానబెట్టండి. హెయిర్ క్లెన్సర్.. బేకింగ్ సోడాను అదనపు నూనెను తొలగించడానికి సహజ హెయిర్ క్లెన్సర్ గా ఉపయోగించొచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాలో కొన్ని నీటిని పోసి పేస్ట్ లా చేసి తలకు అప్లై చేయండి.
ఆ తర్వాత మసాజ్ చేసి బాగా కడగండి. గుండెల్లో మంట నుంచి ఉపశమనం.. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వల్ల కలిగే గుండెల్లో మంటను తగ్గించడానికి పొందడానికి బేకింగ్ సోడాను ఉపయోగించొచ్చు. ఇందుకోసం గ్లాస్ నీటిలో కొంచెం బేకింగ్ సోడాను మిక్స్ చేసి తాగాలి. గోరు సంరక్షణ.. బేకింగ్ సోడాను క్యూటికల్స్ ను మృదువుగా చేయడానికి, గోళ్ల నుంచి మరకలను తొలగించడానికి ఉపయోగించొచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాను కొన్ని నీటిలో మిక్స్ చేసి గోళ్లకు అప్లై చేయాలి.