ఆ చివరి కోరిక నెరవేరకుండానే మరణించిన పవిత్ర జయరాం..?
సీరియల్ నటి పవిత్ర జయరాం ఇటీవల కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మత్రిని జీర్ణించుకోలేకపోయిన ప్రియడు, నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లిన చందు ఆత్మహత్యకు ముందు ఆమె తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈమె మరణంతో సినీ నటులతో పాటు, ఎంతో మంది ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటి వరకు సీరియల్ లో తిలోత్తమగా కనిపించిన పవిత్ర ఇలా అవ్వడం ఏంటి అని అందరూ కంటతడి పెట్టారు.
ఇదిలా ఉంటే సీరియల్స్ లో పవిత్ర ప్రయాణం సులభంగా జరగలేదు. చాలా కష్టాలు పడి ఫేమస్ అయ్యారు. అంతేకాదు మొదట్లో తనకు పారితోషికం కూడా ఇవ్వలేదట. ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యం కోల్పోకుండా ప్రయాణం కొనసాగించింది. కొన్ని సార్లు కేవలం భోజనం మాత్రమే పెట్టేవారట. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఈమె కన్నడ సీరియల్స్ లో నటించారు. ఆ తర్వాత తెలుగులో నిన్నే పెళ్ళాడుతా అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ పవిత్ర కి చాలా గుర్తింపు సంపాదించింది.
ఆ సీరియల్ తర్వాత త్రినయని సీరియల్ లో నటించింది. ఇదెలా ఉంటే పవిత్ర తన చివరి కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇంతకీ ఆమె కల ఏంటంటే..ఈ నటికి డైరెక్షన్ చేయాలి అని కోరికగా ఉండదట. మొదట పవిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా మారింది. పాటలను డైరెక్ట్ చేస్తూ మళ్ళీ డైరెక్షన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సందర్భంలో యాక్టింగ్ రాకపోతే డైరెక్టర్లు పవిత్రాన్ని తిట్టేవారట. అందుకే పట్టుదలతో యాక్టింగ్ నేర్చుకుందట పవిత్ర.
గతంలో పవిత్ర తెలుగు రాక చాలా ఇబ్బంది పడిందట. అలాంటి పవిత్ర తెలుగులో ఆ తర్వాత సాంగ్స్ డైరెక్ట్ చేసింది. ఎలాంటి ప్రాంప్టింగ్ లేకుండా పవిత్ర డైలాగ్స్ చెప్పేవారు కూడా. మొదటిసారిగా పవిత్ర ఆల్టో కార్ కొనింది. అప్పుడు తనకి ఏదో సాధించిన అంత గర్వంగా అనిపించింది అంటూ గతంలో తెలిపింది. అయితే ఎప్పటికైనా కూడా డైరెక్టర్ పవిత్ర జయరాం అనే పేరు రావాలని కోరుకునేదట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్య్వూలో తెలిపింది. కానీ ఈ కల నెరవేరకుండానే అందరినీ వదిలి వెళ్లిపోయారు పవిత్ర జయరాం.