News

ఆ రోజుల్లో జూ. ఎన్టీఆర్ పడ్డ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు. చివరికి వాళ్ళు కూడా..!

తారక్, ఎన్.టి.ఆర్. గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. అయితే ఎంత కష్టం వచ్చినా వాటిని లెక్క చేయకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ ను సంపాదించారు. తాతకు తగ్గ మనవడు అనే పేరు సంపాదించడమే కాదు ఏకంగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ఎన్టీఆర్. ‘స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకి సినీ కెరీర్ అంతా పూలపాన్పు మాదిరి ఉంటుందినుకుంటారు చాలా మంది.

అది కొన్ని విషయాల్లో నిజం కూడా..! కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా జరిగింది. అందుకే అభిమానులకు అతను చాలా స్పెషల్. ఇక ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కొడాలి నాని ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ కొడాలి నాని ఏం మాట్లాడాడు అనుకుంటున్నారా? ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అని.. అతని టాలెంట్ వల్లే ఈరోజు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు అని.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అంటూ కొనియాడారు.

మొదటి నుంచి అతన్ని ఫ్యామిలీ తక్కువ చేసి చూసింది అంతేకాదు కనీసం అతన్ని కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కూడా ఆహ్వానించలేదు అంటూ తెలిపారు. మొదట్లో అతని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా కూడా అతనికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారు నిర్మాతలు అంటూ గుర్తు చేశారు కొడాలి నాని. అంతేకాదు అతను సినిమా యూనిట్ తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

హీరో అయినప్పటికీ తినేటప్పుడు ఇతనికి మొదట్లో కుర్చీ కూడా వేయకుండా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారంటూ గుర్తు చేసుకున్నారు. ఇలా ఒక్క రకంగా కాదు.. పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినా కూడా అతను కొత్త నటుడులానే ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఈ రోజు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు అంటూ తెలిపారు కొడాలి నాని.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker