News

పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా, మరో వీడియో వదిలిన హేమ.

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. హేమ తో పాటు 86 మందికి సంబంధించిన రక్త నమూనాల్లో డ్రగ్స్ షాంపిల్స్ ఉన్నట్లు తెలియడంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నటి హేమ మాత్రం తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదని వాదిస్తుంది.

అయితే ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీలో తెలుగు నటి హేమతో పాటు ఆషి రాయ్ కూడా పాల్గొనగా వీరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు సైతం నిర్వహించారు. అందులో వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో నోటీసులు కూడా జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ రోజు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. బెంగుళూరు రేవ్ పార్టీ కేసు విచారణకు హేమ హాజరు కాను అని కొట్టి పారేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

రేవ్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న హేమ విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరినట్టు తెలుస్తోంది. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు బెంగళూరు సిసిబికి హేమ లేఖ రాశారని చెబుతున్నారు.. హేమ లేఖను పరిగణలోకి తీసుకోని సిసిబి హేమకు మరో నోటీస్ ఇవ్వడానికి పోలీసులు సిద్ధం అయ్యారు. అయితే ఇదిలా ఉండగా హేమకు సంబంధించిన ఒక పాత వీడియో వైరల్ అవుతోంది. ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేసుకోడానికి 100 అబద్ధాలు ఆడాలి అందుకే 99% అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ట్రై చెయ్యండి,

నేను అదే చేస్తాను అందుకే హ్యాపీగా ఉంటాను అంటూ ఆమె చెబుతున్న చిన్న వీడియో బిట్ వైరల్ అవుతోంది. అయితే ఆమె పార్టీకి హాజరై కూడా హాజరు కాలేదని చెప్పిన మాటలను ఆ పాత వీడియోను కంపేర్ చేస్తూ ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. నిజానికి కొన్నాళ్ల క్రితం అంటే లాక్ డౌన్ సమయంలో ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇచ్చింది. అందులోనే ఈ మేరకు కామెంట్లు చేసింది. ఆ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు మేకర్స్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker