News

హార్థిక్ వైఫ్ న‌టాషా గురించి బయటకి తెలియని షాకింగ్ నిజాలు, చివరికి విడాకులు కూడా..!

నటాషా, హార్దిక్‌లకు పెళ్లయి నాలుగేళ్లయింది. ఈ జంట తమ నిశ్చితార్థాన్ని 1 జనవరి 2020న ప్రకటించారు. మే 2020లో వివాహం చేసుకున్నారు. వారు అగస్త్య పాండ్య అనే 3 ఏళ్ల బాలుడికి తల్లిదండ్రులు. మోడల్ కం న‌టి న‌టాషా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించినట్లు నెటిజన్లు గమనించిన తర్వాత వారి గురించిన బ్రేక‌ప్ పుకార్లు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యాయి. న‌టాషా పుట్టిన‌రోజున హార్థిక్ ఎలాంటి పోస్ట్ చేయ‌క‌పోవ‌డం కూడా అనుమానాల‌కు తావిచ్చింది. అయితే నటాషా పూర్తిపేరు నటాషా స్టాన్కోవిక్. ఈమె సెర్బియాకు చెందిన మోడల్, నటి, డాన్సర్ కూడా. ఈమె నటిగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి 2012లో ఇండియాకి వచ్చేసింది.

ఇప్పటికీ నటాషా మోడలింగ్ చేస్తున్నట్లు మీరు ఫొటోషూట్స్ చూడచ్చు. అంతేకాకుండా నటిగా కూడా చాలా సినిమాలు చేసింది. 2013లో సత్యాగ్రాహి అనే ఒక హిందీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసింది. దాదాపుగా క్యామియో అప్పియరెన్స్ లు ఎక్కువగా చేస్తుంటుంది. ఆఖరిసారి 2019లో ది బాడీ అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. నటాషా స్టోన్కోవిక్ సినిమాలు మాత్రమే కాదు.. కొన్ని షోస్ కూడా చేసింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 8లో కంటెస్టెంట్ గా చేసింది. 28 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంది.

ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యింది. అంతేకాకుండా నటాషా 2019లో నాచ్ బలియే అనే డాన్స్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. నటాషా కెరీర్లో ఈ షోకి స్పెషల్ స్థానం ఉంది. అదేంటంటే.. ఈ షోలో ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి పాల్గొంది. నటాషాకి హార్దిక్ పాండ్యాతో పరిచయం కంటే ముందు.. టీవీ యాక్టర్ అయిన అలీ గోనీతో రిలేషన్ లో ఉంది. ఈ విషయాన్ని వాళ్లు డాన్స్ షోలో బహిరంగంగానే ఒప్పుకున్నారు. నిజానికి వాళ్లు రెండుసార్లు రిలేషన్ లో ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా తరచూ కలుస్తూనే ఉంటాం అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు.

అందుకే వాళ్లు అసలు ఎప్పుడు విడిపోయారో కూడా తనకు గుర్తు లేదు అటూ అలీ గోనీ కామెంట్స్ చేసిన వీడియో ఇప్పటికీ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది. అలో గోనీతో విడిపోయిన తర్వాత నటాషా స్టోన్కోవిక్- హార్దిక్ పాండ్యా రిలేషన్ స్టార్ట్ అయ్యింది. వారికి 2020లో వివాహం జరిగింది. అయితే కేవలం పరిమిత సంఖ్య అతిథులతో జరిగింది. ఆ తర్వాత వాళ్లు రెండోసారి కూడా వివాహం చేసుకున్నారు. 2023, ఫిబ్రవరిలో ఉదయ్ పూర్ లో రెండోసారి వివాహం చేసుకున్నారు.

వీరికి అగస్త్య పాండ్యా అనే కుమారుడు ఉన్నాడు. నటాషా- హార్దిక్ పాండ్యా విడిపోతున్నారు అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. కానీ, అది వాళ్లు అధికారికంగా ప్రకటించే వరకు పుకార్లు మాత్రమే. నటాషా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా ఇంటి పేరును కూడా తొలగించింది అంటున్నారు. కానీ, హార్దిక్ పాండ్యా ఫొటోలు, వీడియోలు మాత్రం నటాషా ఇన్ స్టాగ్రామ్ లో అలాగే ఉన్నాయి. మరి.. వీళ్లి రిలేషన్ ఏమౌతుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker