News

ఢీ షో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య, సెల్ఫీ వీడియో వైరల్.

డ్యాన్స్ మాస్టర్ గా పని చేస్తున్న చైతన్య అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ కి ముందు సెల్ఫీ వీడియో ఆయన విడుదల చేశారు..

వీడియో లో తాను ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను వివరించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. అయితే ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ సంఘటన వారి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తన సహచరులతో పంచుకున్నారు. నెల్లూరులోని ఓ హోటల్‌లో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ వీడియోలో చైతన్య వెల్లడించారు.

ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker