ఏడుపు కూడా రావడం లేదు, సంచలన విషయాలు చెప్పిన చైతన్య మాస్టర్ తల్లి.
కొరియోగ్రాఫర్‌గా ఎంతో భవిష్యత్ ఉందనుకున్న చైతన్య హఠాత్తుగా సూసైడ్‌కు పాల్పడడం అందరినీ కలిచివేసింది. పలువురు ప్రముఖులు అతని మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఘటన టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. అప్పుల బాధలు తట్టుకోలేకనే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి, ఉరేసుకొని చనిపోయాడు.
అయితే చైతన్య అప్పులపాలయ్యాడంటే స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. భారీగా అప్పులు చేసే అవసరం తనకు లేదని, ఒకవేళ అప్పులైనా తీర్చేంత ఆస్తులు తన కుటుంబానికి ఉన్నాయని చెబుతున్నారు. ఇక చైతన్య తల్లి లక్ష్మీ రాజ్యం అయితే తన కొడుకు అప్పుల బాధతో చనిపోయాడనేది అబద్దం అంటున్నారు. అన్ని సమస్యలు ఉన్నా.. తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆత్మహత్యకు 15 నిమిషాల ముందు నాతో మాట్లాడాడు.
సన్మాన కార్యక్రమంలో డల్‌గా ఉన్నావ్.. నవ్వుతూ ఉండమని చెప్పా. ‘పెద్ద పెద్ద వాళ్లు నీకు సన్మానం చేస్తున్నారు. అందరితో పరిచయాలు పెంచుకొ’ చెప్పా. సరే అన్నారు. ఆ తర్వాత 15 నిమిషాలకే సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. అంతకు ముందు టెంపుల్‌కి వెళ్లాలి ఇంటికి రా అంటే.. ‘నాక్కుడా చిరాకుగా ఉందమ్మా..గుడికి వెళ్దాం.. ప్లాన్ చెయ్’ అన్నాడు.
ఇప్పుడు నన్ను వదిలి అన్యాయం చేశాడు. గతంలో ఒక్కసారి ఫోన్ చేసి ‘నువ్వు ఇంటికి రా లేదంటే చచ్చిపోతా’అంటే.. ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కుడా ఒక బెర్త్ కన్ఫామ్ చేయమని అన్నాడు. మరి ఇప్పుడు ఒక్కడే వెళ్లిపోయాడు. ‘నేను చనిపోతున్న.. నువ్వు కూడా రా అమ్మా’అంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా’ అని చైతన్య తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకా మాట్లాడుతూ.. ‘డబ్బుల కంటే ఎక్కువగా ఆరోగ్యం కాపాడుకోవాలని తరచూ చెప్పేవాడు. ‘పిల్లలకు మంచి ఫుడ్ పెడితేనే మనల్ని గౌరవిస్తారు. డబ్బులదేముంది. ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ‘అని చెప్పేవాడు.
ఇప్పుడు డబ్బులు వల్లే నేను చనిపోతున్నానని అనడమే నాకు నచ్చట్లేదు. అడిగితే నేను ఇవ్వానా? తనకు అప్పులున్నాయనే విషయం ఫ్రెండ్స్‌కి కూడా చెప్పకపోవడం బాధేస్తుంది. నన్నుమోసం చేసి పోయాడు. వాడు చేసిన పనికి ఏడుపు కూడా రావడం లేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నా జీవితమే వాడు. వాడి కోసం ఎన్నో బాధలు పడ్డా. డబ్బుల విషయం ఏముంది? అది నాకో లెక్క కాదు. వాడు చనిపోయాడనే దానికంటే.. నాకు ద్రోహం చేశాడనే బాధే ఎక్కువగా ఉంది’అంటూ ఆమె ఎమోషనల్ అయింది.