News

సంచలనం, చైత‌న్య మాస్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవడానికి రీజన్ ఇదే.

నెల్లూరులో ఓ ఈవెంట్ కు వెళ్లి అక్కడే తాను ఉన్న రూమ్ లో ఆత్మహత్య చేసుకొని మరణించారు. చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకునే ముందు ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో అప్పుల బాధల వల్లే, ఆ అప్పులు తీర్చేలేకే, ఒత్తిడి ఎక్కువయ్యే చనిపోతున్నాను అని తెలిపాడు. అయితే ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకోవడంతో టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది. తాజాగా చైతన్య మాస్టర్ ఆత్య‌హ‌త్య‌పై కండెక్ట‌ర్ ఝాన్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

చైత‌న్య అప్పుల గురించి ఆమె ఓపెన్ అయింది. తాను అప్పుల బాధ భ‌రించ‌లేక ఆత్మహ‌త్య చేసుకుంటున్న‌ట్లు వీడియో విడుద‌ల చేసి చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లారు.ఆయన బలవన్మరణం వినోద రంగాన్ని కుదిపేసింది. ఈ నేప‌థ్యంలో బుల్లితెర‌ నటి కండెక్ట‌ర్ ఝాన్సీ.. చైత‌న్య మాస్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రోగ్రామ్స్‌కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం వల్లనే చైతన్య మాస్టర్ ఆర్ధిక సమస్యలతో సూసైడ్ చేసుకున్నాడని ఆమె చెప్పింది. చైత‌న్య మాస్ట‌ర్ చాలా మంచి వ్య‌క్తి. తనకున్నంతలో ప‌క్క‌వాళ్ల‌కు సాయం చేసే గుణం అయ‌న‌ది అని కండెక్ట‌ర్ ఝాన్సీ చెప్పింది. డిసెంబ‌ర్ 31న చేసిన ఓ ప్రోగ్రాంలో ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్‌, కొంతమంది ఆర్టిస్టులు ఆయ‌న‌కు హ్యాండివ్వడంతో ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్లకు లాస్ రావడంతో క‌మిటీ వాళ్లు మాస్ట‌ర్‌కు రావాల్సిన అమౌంట్‌ను ఆపేశారు.

దాదాపు 7 ల‌క్ష‌ల మొత్త‌మ‌ది. హ్యాండ్ ఇచ్చిన ఆర్టిస్ట్ లు వల్ల మనీ ఆగిపోతే వచ్చిన ఆర్టిస్ట్ లను డబ్బు ఇవ్వకుండా మోసం చేయకూడదని.. బయట అప్పుతెచ్చి వచ్చినవాళ్లకు పేమెంట్ చేశాడు చైతన్య మాస్టర్. ఇక ఆ అప్పుని పూర్చడానికి అప్పులు మీద అప్పులు చేయాల్సి రావడంతో.. త‌ట్టుకోలేక చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకున్నట్లు కండెక్ట‌ర్ ఝాన్సీ తెలిపింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆర్గ‌నైజ‌ర్స్‌కు నా విన్న‌పం అంటూ.. ఓ ప్రోగ్రామ్ చేసేట‌ప్పుడు మేము ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాం. ఆరోగ్యం ఎలా ఉన్నా ఆ ప్రోగ్రాం సక్సెస్ చెల్లని చూస్తాం. అలాంటిది మీరు ఇలా పేమెంట్స్ ఆపడం వల్ల ఆర్టిస్టులకు డ‌బ్బులు ఇవ్వ‌లేక‌, వాళ్లు చేసే పోన్ కాల్స్ ఎత్తి స‌మాధానం చెప్ప‌లేక ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి అలా చేయొద్దు అని కండెక్ట‌ర్ ఝాన్సీ పేర్కొంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker