Health

రోజూ రాత్రి పూట చపాతీలు తినకూడదా..? డాక్టర్లు ఏం చెప్పారో తెలుసుకోండి.

ప్రతి రోజు చపాతీలనే తినే అలవాటును చేసుకునే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే లేనిపోని కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందట. అందువల్ల రాత్రిపూట పూర్తిగా అన్నం మానేసి దాని స్థానంలో చపాతీ తినే బదులు.. అన్నం తక్కువ తిని మిగతా భాగం చపాతీలు తినమని సూచిస్తున్నారు వైద్యులు. అయితే రాత్రిళ్లు భోజనం తిన్న తర్వాత… వెంటనే పడుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు. కనీసం గంటన్నర తర్వాతే పడుకోమంటారు.

రాత్రి వేళ అన్నం తింటే… షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయనీ, బరువు పెరిగిపోతారనీ ఇలా చాలా మంది అన్నం తినాలా వద్దా అని డౌట్ పడుతూ ఉంటారు. ఐతే… అన్నం బదులు… చపాతీలు తినమంటున్నారు డాక్టర్లు. దీని వల్ల చాలా లాభాలున్నాయి. చపాతీలైతే… ఎంత నిల్వ ఉన్నవి తింటే అంత ఎక్కువ ఆరోగ్యం. అంటే… ఉదయం చేసుకున్న చపాతీలను రాత్రి పూట తిన్నా పర్వాలేదు. అదీ కాక… చపాతీలు వేగంగా అరగవు. నెమ్మదిగా జీర్ణం అవుతాయి.

అందువల్ల బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. దానికి తోడు… రాత్రివేళ జీర్ణక్రియా వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల రాత్రి వేళ చపాతీలు తినడమే బెటరంటున్నారు డాక్టర్లు. బరువు తగ్గాలనుకునేవారు… చపాతీలను ఎక్కువ నూనె కాకుండా… తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వెయ్యకుండా కూడా చేసుకోవచ్చు. అన్నం కంటే చపాతీ ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. కాబట్టి రెండు లేదా మూడు చపాతీలు మాత్రమే తినాలి. లక్కేంటంటే చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు.

పైగా గోధుమల్లో ఐరన్ ఎక్కువ కాబట్టి… రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అది గుండెకు మేలు చేస్తుంది. బయటి మార్కెట్లలో అమ్మే గోధుమ పిండిలో మైదా కూడా కలుపుతారు. మైదా ఉన్న గోధుమ పిండి ఆరోగ్యానికి ప్రమాదకరం. మీరు గోధుమపిండి కొనుక్కునేటప్పుడు బ్రాండెడ్ కంపెనీది కొనుక్కోండి. దానిపై మైదా 0 పర్సెంట్… గోధుమ 100 పర్సెంట్ అని రాసి ఉండాలి. అలాంటి గోధుమ పిండితో అనారోగ్యాలు రావు. భోజనం చేశాక ఎలాగైతే ఓ గంటన్నర తర్వాత నిద్రపోతారో… చపాతీలు తిన్నాక కూడా… గంటన్నర తర్వాతే నిద్రపోవాలి.

అలాగే రోజూ టైమ్ ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి. రాత్రి 7 తర్వాత 10 లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. ఉదయం వేళ కూడా చపాతీలు తింటే మంచిదే. కానీ చాలా మంది రాత్రి వేళే వాటిని తినేందుకు ఇష్టపడతారు. చపాతీల్లో కర్రీ కోసం రోజూ ఆలూ కర్రీనే వాడొద్దు. ఆలూ ఎక్కువ తింటే లావయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఒక్కో రోజు ఒక్కో రకమైన కర్రీని వాడితే… అన్ని రకాల పోషకాలూ బాడీకి అందుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker