Health

కుంకుడు కాయలు ఇలా చేసి వాడితే మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది.

చాలా మందిని వేధించే సమస్య జుట్టు రాలడం. వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలుతోంది. ఈ సమస్యను అనేక ఎదుర్కొంటున్నారు. దీంతో ఒక్కోసారి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. జుట్టు రాలడానికి తీసుకునే ఆహారంతోపాటు.. వాడే షాంపూలు కూడా ముఖ్య కారణం. అయితే ఇప్పుడంటే తల స్నానం చేయడం కోసం, జుట్టు కోసం మనం షాంపూలను వాడుతున్నాం, కానీ ఒకప్పుడు కుంకుడుకాయలనే వాడేవారు. నిజానికి కేశ సంరక్షణలో కుంకుడుకాయలు పనిచేసినంతగా షాంపూలేవీ చేయలేవు.

ఉరుకుల పరుగుల జీవన విధానంలో, సమయపాలన లేని ఆహారపు అలవాట్ల కారణంగా మనం ఇప్పటికే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. ఈ తరుణంలోనే చాలా మందికి జుట్టు ఊడిపోవడం, చుండ్రు రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా నిరోధించడంలో కుంకుడుకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మన చిన్నతనంలో అమ్మమ్మ లేదా నాయనమ్మ దగ్గర ఉండి మరీ కుంకుడుకాయలతో తలస్నానం చేయించేవారు. అందుకు కారణం కేశసంరక్షణలో కుంకుడుకాయ పనితనమే. కుంకుడుకాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది.

జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది. ఫలితంగా సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది. స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్‌ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు. రెగ్యులర్‌గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది.

కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ ఏ, డీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అందులో ఉన్న విటమిన్స్ జుట్టు కుదుళ్ళకి బలాన్నిచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ విటమిన్స్ కొత్త ఫాలికిల్స్ ఏర్పడడానికి సహాయం చేస్తాయి. సీబమ్ ప్రొడక్షన్‌కి హెల్ప్ చేసి జుట్టుకి నరిష్‌మెంట్‌ని అందిస్తాయి. స్కాల్ప్‌కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్‌ని కుంకుడుకాయలు పరిష్కరిస్తాయి. చుండ్రు, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటివన్నీ కుంకుడుకాయలను రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే దూరమవుతాయి.

పైగా, ఒకసారి ఈ ప్రాబ్లంస్ క్లియర్ అయ్యాక మళ్ళీ రాకుండా కుడా ఉంటాయి. కుంకుడు కాయలు, హెన్నా కాంబినేషన్ మంచి కండిషనర్‌లా పని చేస్తుంది. దాని వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. ఫ్రిజ్జీ హేయిర్ సమస్య పూర్తిగా పోతుంది. కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. జుట్టు చిక్కులు లేకుండా స్మూత్‌గా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker