అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకకు వెళ్ళడానికి రామ్ చరణ్ డబ్బులు తీసుకున్నారా..? అసలు విషయం ఇదే.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1న గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రారంభమయ్యాయి. పాప్ గాయని రిహానా, నటుడు షారుఖ్ ఖాన్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ సహా దాదాపు 1,000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ కూడా ఈ వేడుకకు సతీమణితో కలిసి వెళ్లారు.
ఈ వేడుకల్లో ఖాన్ త్రయం షారుఖ్, అమీర్, సల్మాన్ లు వెళ్లడమే కాదు ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులు కూడా వేశారు. వీరితో పాటు స్టేజ్ మీద రామ్ చరణ్ డాన్స్ చేశారు. ఇంత హడావిడి చేసినందుకు ఖాన్ త్రయానికి అంబానీ బాగానే ముట్టజెప్పాడని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ అవుతున్నాయి. అయితే ప్రత్యేకమైన వేడుకల్లో పాల్గొనేందుకు సెలబ్రెటీలకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇస్తారట. దాని కోసం డబ్బులు కూడా ఇస్తారట.
పాపులర్ పాప్ సింగర్ రిహాన్నే కు రూ. 54 కోట్ల నుంచి రూ. 63 కోట్ల వరకు ఇచ్చారని టాక్. అయితే ఖాన్ త్రయానికే కాదు రామ్ చరణ్ కు కూడా డబ్బులు ఇచ్చారని టాక్. కానీ బాలీవుడ్ స్టార్లతో పాటు రామ్ చరణ్ లు ఈ వేడుకలో ఇష్టపూర్వంగా పాల్గొన్నారని.. వారికి డబ్బు అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు స్టార్ల అభిమానులు. చెర్రీ సహజంగానే చాలా డబ్బులు ఉన్నవాడు. ఆయనకు డబ్బుతో పనేంటి. ఆయన సంపాదించడం మాత్రమే కాదు.
తండ్రి చిరంజీవి, భార్య ఉపాసనలు కూడా సంపాదిస్తున్నారు. కేవలం ఆహ్వానించారని మాత్రమే వెళ్లాడని.. మిగతా సెలబ్రెటీలతో కలిసి స్టెప్పులు వేశారని.. ఆయన అభిమానులు అంటున్నారు. డబ్బు కోసం మాత్రం ఆ వేడుకకు వెళ్లలేదని..ఇలాంటి వివాదాల్లోకి మా చెర్రీ అన్నను లాగవద్దు అంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు.