వామ్మో, నీతా అంబానీ ధరించిన నెక్లెస్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా..?
నీతా అంబానీ నెక్లెస్ కు జత చేసిన ధరపై సోషల్ మీడియాలో రియాక్షన్స్ వెల్లువెత్తాయి. నెటిజన్లలో ఒకవిధమైన రియాక్షన్ కనిపిస్తోంది. ఇది గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో అత్యంత చర్చనీయాంశమైన అంశాలలో ఒకటిగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ-రాధిక మార్చంట్ ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వేడుకలో జరిగే ప్రతి చిన్న అంశం కూడా వైరల్ అవుతోంది. ఆహార పదార్థాల నుంచి మొదలుకొని, గెస్ట్ లు, వాళ్లకు కల్పించిన వసతులు.. ఇలా అన్నీ ప్రత్యేకంగానే నిలుస్తున్నాయి.
ఇది దేశంలోనే రిచెస్ట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంగా చెప్పక తప్పదు. అయితే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన మూడు రోజుల వేడుకలకు దాదాపు 2,000 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ మూడు రోజులకు రూ. 1,259 కోట్లు ముకేశ్ అంబానీ ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ వేడుకలకు అమెరికాకు చెందిన బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌లు షేర్వాణీ ధరించడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు.
అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తన కుటుంబంతో కలిసి సందడి చేాశారు. ఈ వేడుకలలో నాటు నాటు పాటకు ఖాన్ త్రయంతోపాటు చెర్రీ డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్లో అంబానీ కుటుంబ సభ్యులు ధరించిన ఆభరణాల గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అనంత్ రూ.63 కోట్లు విలువైన వాచ్ ధరించడం చూసి జుకర్ బర్గ్ భార్య షాకయ్యింది. ఇక ఇప్పుడు నీతా అంబానీ ధరించిన ఆభరణాల విలువ తెలిసి నోరెళ్లబెడుతున్నారు నెటిజన్స్.
వేడుక చివరి రోజున నీతా అంబానీ అందమైన చీర కట్టుకుని పచ్చ హారాన్ని ధరించారు. నెక్లెస్ ధర రూ. 500 కోట్లు. ఇక ఆమె చేతికి ధరించిన డైమండ్ రింగ్ ధర రూ. 53 కోట్లు ఉందని తెలుస్తోంది. 52.58 క్యారెట్ డైమండ్ కావడం వల్ల ఆ రింగ్ అంత విలువ ఉందని తెలుస్తోంది. ఆ వజ్రం పేరు మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్. గతంలో ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో నీతా ఇదే డైమండ్ రింగ్‌ని ధరించడం గమనార్హం.