హఠాత్తుగా ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో అజిత్, అసలేం జరిగిందంటే..?
హీరో తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను చాలా సునాయాసంగా మాట్లాడగలడు. యంగ్ హీరోగా కొంతకాలం పాటు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన అజిత్.. ఇప్పుడు ఏజ్ అయిపోవస్తున్నా .. జుట్టు తెల్లబడుతున్నా .. ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా .. ఆయనకు తగిన పాత్రలను ఎన్నుకుంటూ.. ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంటున్నాడు అజిత్.
అయితే కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ హాస్పిటల్లో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గురువారం అజిత్ చేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. అజిత్ హాస్పిటల్ పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అజిత్‌కు ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతోన్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అజిత్ ప్రైవేట్ హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలిసింది. డాక్టర్ల చెకప్‌లో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు.
డాక్టర్ల సూచన మేరకు అజిత్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లు చెబుతోన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అజిత్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.