News

రతి దేవి కన్న కొడుకునే ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా..?

మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు. ఆ శక్తిని తానొకసారి పరీక్షించి చూసుకోవాలనుకున్నాడు మన్మధుడు. అయితే ఇతిహాసాల ప్రకారం మహావిష్ణువు మరియు లక్ష్మీదేవికి కలిగిన సంతానమే కామదేవుడు.కామ దేవుడి భార్య రతీదేవి. కామ దేవుడి లాగే రతిదేవి కూడా ప్రేమకి ఆకర్షణకి దేవతగా వర్ణించబడుతుంది. మహాశివుడు తపస్సులో లీనమై ఉన్నప్పుడు కామ దేవుడు సూక్ష్మ రూపం దాల్చి శివుడి చెవి ద్వారా ఆయన శరీరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మహా శివుడి శరీరం పులకించి తపస్సు భంగం అవుతుంది.

శివుడు తన జ్ఞాన నేత్రంతో ఏం జరిగిందో గ్రహించగా, తన ఉనికి మహాశివునికి తెలిసిపోయిందని కామదేవుడు కూడా గ్రహిస్తాడు. అప్పుడు కామ దేవుడు శివుడి శరీరం నుండి బయటికి వచ్చి ఒక చెట్టు చాటున దాక్కొని శివుడు మీదకు మోహము అనే బాణాన్ని విసురుతాడు. దాంతో కోపించిన శివుడు త్రినేత్రం తో కామ దేవుడిని భస్మం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కామ దేవుడి భార్య రతీదేవి చింతిస్తూ ఉండగా అప్పుడు ఆకాశవాణి ఆమెతో శివున్ని ఆరాధించమని చెబుతుంది. అప్పుడు మహా శివుడు ప్రత్యక్షమై కామదేవుడు వదిలిన బాణం వల్ల నేను అతన్ని బస్మం చేశాను.కానీ అతడు జీవించే ఉన్నాడు.

అతను ఒక అదృశ్యరూపంలో ఉన్నాడు. ఈ విషయాన్ని రతిదేవి ద్వారా తెలుసుకున్న కామదేవుడు మహా కాల వనానికి వెళ్లి శివుడు చెప్పినట్లు శివలింగాన్ని స్థాపించి భక్తిశ్రద్ధలతో ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నువ్వు అదృశ్య రూపంలో ఉన్నా కూడా అన్ని పనులు చేసే క్షమత నీకు ఉంది.అంతే కాకుండా ద్వాపరయుగంలో కృష్ణావతారంలో నువ్వు రుక్మిణికి పుత్రుడుగా జన్మించి ప్రద్యుమ్నుడిగా పిలువబడతావని చెప్పాడు. ఇలా కామదేవుడు మళ్ళీ జన్మిస్తాడు. ప్రద్యుమ్నుడి వల్ల ఆపద ఉందని శంభాసురుడు సముద్రంలోకి అతన్ని విసిరేస్తాడు.

సముద్రంలో పెద్ద చేప ప్రద్యుమ్నుడిని మింగి చేపల వల లో పడుతుంది. ఆ చేప శంభాసురుడి వంటశాలలోకే తీసుకెళ్లడుతుంది. ఈ విషయం తెలుసుకున్న రతిదేవి ఆ వంటశాలలో పనిచేసే మాయావతి అనే వంటలక్క గా మారి అక్కడికి వెళ్లి ఆ చేప నుంచి బయటికి వచ్చిన బాలుడిని పెంచి పెద్ద చేస్తుంది. ఆ బాలుడు పెద్దవాడైన తరువాత పూర్వజన్మ గుర్తుకు వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మాయావతి రూపంలో ఉన్న రతిదేవిని పెళ్లి చేసుకొని ద్వారకా నగరానికి చేరుకుంటాడు కామదేవుడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker