News

రామ్‌ చరణ్‌ కారును వెంబడించిన అభిమానులు, దీంతో చరణ్ ఏం చేసాడో చుడండి.

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ నగర శివారులోని ఇస్నాపూర్‌లో జరుగుతోంది. రామ్‌ చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలుసుకున్న చెర్రీ ఫ్యాన్స్‌ .. ఆయన షూటింగ్ ముగించుకుని వచ్చే వరకు ఎదురు చూస్తూ.. ఆ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ కారును వెంబడించారు.

అయితే ఇటీవలే బెంగుళూరు నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న చరణ్..ఇప్పుడు తిరిగి గేమ్ ఛేంజర్ సెట్ లో అడుగుపెట్టారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారం ఏరియాల్లో జరుగుతుంది. నాలుగు రోజులుగా అక్కేడ ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున చెర్రీని చూసేందుకు తరలివస్తున్నారు.

షూట్ ప్లేస్ నుంచి కొన్ని వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. అయితే శుక్రవారం రాత్రి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరగా కొంతమంది అభిమానులు చరణ్ కారును వెంబడించారు. వాళ్లకు అందకుండా చెర్రీ వేగంగా వెళ్లిపోతాడేమో అనుకున్నారు. కానీ చరణ్ కారును కాస్త్ స్లో చేసి కారు విండో దించి అభిమానులకు అభివాదం చేసి దయచేసి జాగ్రత్తగా వెళ్లండి అని చెప్పాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవతుంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో చరణ్ మొదటి సారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అలాగే ఇందులో మరో రెండు పాత్రలు పోషిస్తున్నాడట. కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. త్వరలోనే ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు చరణ్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker