Health

మీ శరీరంపై ఉన్నవి మాములు పుట్టుమచ్చలా..? లేదా క్యాన్సర్ మచ్చలా..? ఇలా చెక్ చేసి తెలుసుకోండి.

మృతకణాలు చర్మ రంధ్రాలను పూడ్చేయడంవల్ల ఈ బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. అదేవిధంగా చర్మంపై గల చిన్న రంధ్రాల్లో డెత్‌ స్కిన్ సెల్స్ పేరుకుపోవడంవల్ల కూడా నల్లటి మచ్చలు వస్తాయి. ముక్కు, గదమ మీద ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వయసు పెరిగే కొద్ది వచ్చే మచ్చలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఏమైతే ఏముంది చూసేందుకు బాగానే ఉంది కదా అనుకుంటారు. అది ఏమైనా మీ అందాన్ని ఇబ్బంది పెడుతుందంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. మరికొందరు అది పుట్టుమచ్చే అయినా సర్జరీలు చేసి మరీ దానిని తీయించుకుంటారు.

అయితే ప్రతి మచ్చ ఏదొక భిన్నమైన కథను కలిగి ఉంటుందట. పుట్టుమచ్చలు అంటే ఏమిటి..? పుట్టుమచ్చలను శాస్త్రీయంగా నెవి అని పిలుస్తారు. ఇవి శరీరంలోని మెలనోసైట్స్ అనే క్లస్టర్డ్ పిగ్మెంట్ ఉత్పత్తి కణాల ద్వారా ఏర్పడతాయి. ఇవి శరీరంలోపలి నుంచి చర్మంపైకి కనిపిస్తూ పుట్టుమచ్చలుగా కనిపిస్తాయి. ఇవి వివిధ రంగులు, ఆకారాలు, పరిమాణాలలో కనిపిస్తాయి. పుట్టుమచ్చలు సాధారణంగా మొదటి రెండు దశాబ్ధాలలో ఉద్భవిస్తాయి. యుక్తవయసు నుంచి 40 ఏళ్లవరకు ఉంటాయి. కాలక్రమేణా మార్పులకు లోనవుతాయి. లేదంటే లేత రంగునుంచి ముదురు రంగుకు మారుతూ ఉంటాయి.

పుట్టు మచ్చలు v/s చిన్న మచ్చలు:- కొన్ని చిన్న చిన్న మచ్చలను పుట్టుమచ్చలు అనుకుంటారు. పుట్టుమచ్చలు అనేవి చర్మకణాల సమూహాల నుంచి విభిన్నంగా ఉంటాయి. చిన్నచిన్న మచ్చలకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఇవి ఫ్లాట్ రూపాన్ని కలిగి ఉంటాయి. రెండో రకం మెలనోసైట్​ల ద్వారా ఉత్పత్తి అయి.. మెలనిన్ నుంచి వాటి రంగును పొందుతాయి. అంతేకాకుండా సూర్యరశ్మి ద్వారా ప్రభావితమవుతాయి. చిన్నచిన్న మచ్చలు సాధారణంగా పుట్టుమచ్చలతో సంబంధం ఉన్నా.. రూపాంతరం చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండవు. కాబట్టి వాటిని మచ్చలుగా గుర్తించాలి.

పుట్టుమచ్చలు సాధారణంగా చాలా ముదురు రంగులో ఉంటాయి. చిన్నచిన్న మచ్చలు ఎక్కువగా ఎరుపు లేదా లేత గోధుమ రంగులో కనిపిస్తాయి. క్యాన్సర్ మచ్చలు:- పట్టుమచ్చలలో ఎక్కువ భాగం ప్రమాదకరం కానప్పటికీ.. కొన్ని చర్మ క్యాన్సర్​ను అభివృద్ధి చేస్తాయి. ముఖ్యంగా ఎక్కువసేపు సూర్యరశ్మికి గురైనప్పుడు వీటి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. డైస్ప్లాస్టిక్ లేదా ఎటిపికల్ నెవి అని పిలువబడే మచ్చలు మెలనోమా అంటే మెలనోసైట్స్​లో మొదలయ్యే ఒక రకమైన చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రెగ్యూలర్​గా స్కిన్ టెస్ట్ చేయించుకుంటే వీటి గురించి మీరు పూర్తి అవగాహనతో ఉండొచ్చు.

అంతేకాకుండా ఈ తరహా క్యాన్సర్స్​ను ముందుగా గుర్తించగలుగుతారు. తద్వారా నివారణ చర్యలు, చికిత్సలు త్వరగా ప్రారంభించవచ్చు. కాబట్టి పుట్టుమచ్చలు కాకుండా చర్మంపై వచ్చే మచ్చలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంటే మంచిది. కొన్ని మచ్చలు తక్షణమే ఆందోళన కలిగించవు కానీ.. దీర్ఘకాలికంగా సూర్యరశ్మి వల్ల ప్రభావానికి గురై.. క్యాన్సర్ కారకాలను ప్రేరేపించవచ్చు. కాబట్టి.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. శరీరంపై ఏదైనా మచ్చ పరిమాణంలో లేదా రంగులో మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker