Health

అమ్మాయిలు ఈ విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

సామాజిక నిషేధాల కారణంగా యోని ప్రాంతం లేదా ప్రైవేటు పార్ట్ హైజీన్‌ను ఆడవారు పెద్దగా పట్టించుకోరు. అయితే మహిళలు జెనిటల్ ఏరియా పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల సెక్స్ సమయంలో డ్రైనెస్, దురద, ఇన్ఫెక్షన్లు, నొప్పి లేదా లైంగిక సంతృప్తి తగ్గడం వంటి అనేక సమస్యలు వస్తాయి. అయితే స్త్రీ జననేంద్రియ సమస్యలను పట్టించుకోకుంటే తీవ్రమైన పరిణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు. ఇవి సంతానోత్పత్తి, జీవన నాణ్యతను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని సమస్యలను వాటంతటా అవే తగ్గొచ్చు.. కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెట్టవచ్చు.

అలాంటి వాటికి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. నెలసరి సమయంలో వైట్ డిశ్చార్జ్ ప్రతి అమ్మాయికి సర్వసాధారణమే. ఇది పెద్ద విషయమే కాదు. పైగా ఇది యోని ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇతర ఇన్​ఫెక్షన్ల బారిన పడకుండా యోనిని రక్షిస్తుంది. అయితే మీకు అసాధారణమైన సమయంలో వైట్ డిశ్చార్జ్ ఉన్నా.. దానిని నుంచి దుర్వాసన వస్తున్నా అది ఇన్ఫెక్షన్​ను సూచిస్తుంది. ఈ సమయంలో సబ్బులు, క్రీములు, లోషన్లు వంటివి ఉపయోగిస్తే యోనికి మరింత చికాకు కలుగుతుంది. వీటిని వినియోగిస్తున్నప్పుడు డిశ్చార్జ్ అవుతున్నా కూడా వాటిని ఆపేస్తే మంచిది.

ఏమి చేసినా దీనిలో మార్పు కలగకపోతే.. మీరు గైనిక్​ని సంప్రదించాలి. లేకుంటే ఇది గర్భాశయ క్యాన్సర్, క్లామిడియా, గోనేరియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. పీరియడ్స్ సమయంలో, గర్భనిరోధక మాత్రలు వేసుకున్నప్పుడు రక్తస్రావం కావొచ్చు. అయితే అసాధారణ సమయంలో యోని నుంచి రక్తస్రావం వస్తుందంటే మీరు జాగ్రత్త పడాలి. అసాధారణ రక్తస్రావం కొన్నిసార్లు పీరియడ్ సమయంలోని మార్పులతో ముడిపడి ఉంటుంది. లేదంటే.. ఎండోమెట్రియోసిస్, ఫ్రైబాయిడ్స్, అండాశయ తిత్తులు లేదా క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి.

కాబట్టి వెంటనే గైనకాలజిస్ట్​ని సంప్రదిస్తే మంచిది. యోనిలో దురద కొన్నిసార్లు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో యోనిలో ఎరుపు, అసౌకర్యం, వాపు లేదా తీవ్రమైన మంటతో కలిగిన దురద వస్తే మాత్రం గైనిక్​ను సంప్రదించండి. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా లైంగికంగా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య కలుగుతుంది. ఈ సమస్య యోని సమస్యల్లో అత్యంత డేంజర్​గా చెప్పవచ్చు. మూత్ర విసర్జనకు తరచుగా వెళ్లినా.. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే మీరు గైనిక్​ను సంప్రదిస్తే మంచిది. ఇది లైంగికంగా సంక్రమించే అనారోగ్యం. ఫైబ్రాయిడ్ లేదా మూత్రాశయానినికి సంబంధించిన సమస్యకు ఇది సంకేతం కావొచ్చు.

ఈ సమస్య ఉన్నప్పుడు మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. పొత్తికడుపులో లేదా కటి ప్రాంతంలో నొప్పిగా ఉంటుందా? పీరియడ్స్ సమయంలో ఇలాంటి నొప్పి సాధారణమే. కానీ పీరియడ్స్ లేని సమయంలో కూడా మీరు పెల్విక్ ప్రాంతంలో నొప్పిని అనుభవిస్తుంటే దానిని విస్మరించకండి. ఇది పునరుత్పత్తి, అండాశయ తిత్తిలో సమస్యలకు చిహ్నంగా చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి జననేంద్రియ సమస్యలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. వారి సలహాలు, సూచనలు ఫాలో అయితే.. మీరు హెల్తీగా, హ్యాపీగా ఉంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker