మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు ఒకటి ఈ కాయ తింటే చాలు, తొందలోనే షుగర్ వ్యాధి తగ్గిపోతుంది.
అవోకాడోలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా అవసరమైనది, పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. అయితే ఈ రోజుల్లో గాడి తప్పిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ ఒక్కసారి సోకిందంటే.. నయం కావడం అసాధ్యం. ఇది ప్రాణాంతక వ్యాధి కాదు. కానీ, తియ్యని స్లో పాయిజన్ లాంటిది. దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదు.
శరీరంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే అసలైన మందు. అందుకే షుగర్ బాధితులు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ అవకాడో తింటే షుగర్ అదుపులో ఉంటుందని తాజా అధ్యయనం పేర్కొంది. అవకాడోలో పీచుపదార్థం ఎక్కువగా.. కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ పేషంట్లకు మంచి ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ ఒక అవకాడోను ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టైప్ 2 డయాబెటిస్ అనేది తీవ్ర సమస్యగా మారింది.
ప్రపంచంలోని వయోజన జనాభాలో దాదాపు 10.5 శాతం మందికి టైప్ 2 డయాబెటిస్ ప్రభావితం చేస్తుంది. వీరిలో 50 శాతం మందికిపైగా టైప్ 2 డయాబెటిస్ ను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో టైప్ 2 డయాబెటిస్ ప్రాబల్యం గణనీయంగా పెరగడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. అవకాడోను పోషకాల పవర్ హౌస్ అంటారు. రుచితోపాటు ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. నిత్యం అవకాడో డైట్లో చేర్చుకున్నట్లయితే గుండె ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, బరువు తగ్గడంతోపాటు డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
అవకాడోలో జింక్, విటిమిన్ బి6, విటమిన్ బి2, మాంగనీస్, ఫొలేట్, విటమిన్ కె, విటమిన్ ఎ, మిటమిన్ బి3, విటమిన్ సి, ఐరన్, కోలిన్, మెగ్నీషియం, ఫైబర్, కార్బొహైడ్రెట్స్, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అవకాడోను పోషకాలకు పవర్ హౌస్ వంటిది అంటారు. 45 నుంచి 84 ఏళ్ల వయస్సున్న 6 వేల మంది డేటాను విశ్లేసించిన తర్వాత అవకాడో తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనం వెల్లడించింది. అవకాడో తీసుకున్న వారిలో రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పరిశీలించారు పరిశోధకులు. అవకాడో తిన్నవారిలో మెటాబాలిజం ఉత్పత్తి అయినట్లు పరిశీలించారు.
అయితే ప్రతిఒక్కరిలో ఇలాంటి చర్య చూపనప్పటికీ కొంతమందిలో మాత్రం బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉందని ఫలితాలు సూచించాయి. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను అవకాడో తగ్గించగలదని పరిశోధన నొక్కి చెబుతుంది. అవకాడో తినేవారిలో ఆరేళ్లలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20 శాతం తగ్గినట్లు పరిశోధనలో తేలింది. అంతేకాదు బరువు తగ్గడం, ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి..హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ ను నిర్వహించడానికి సహాయపడింది.