Health

రోజు ఉదయాన్నే ఈ టీ తాగితే కొవ్వు, బీపీ, షుగర్ అన్ని కంట్రోల్ లో ఉంటాయి.

గొంతునొప్పిగా ఉన్నప్పుడు మునగాకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి వేసి కాసేపు మరిగించి కషాయం రూపంలో తీసుకుంటే గొంతునొప్పి తగ్గుతుంది. కంటిచూపు సమస్యలను నివారించడంలో మునగ గొప్పగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. క్యాన్సర్ వ్యాధితో భాదపడేవారు.. ప్రతిరోజూ మునగాకుతో చేసిన వేపుడు తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. స్థూలకాయం, అధిక బరువు సమస్యతో బాధపడేవారు మునగ ఆకు టీ తీసుకుంటే మంచిది. మునగ ఆకు టీ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

మునగ ఆకుల టీ హైపర్‌టెన్షన్‌ పేషెంట్స్‌కు సహాయపడుతుంది. మునగ ఆకుల్లో క్వెర్సెటిన్‌ అనే పోషకం ఉంటుంది. అయితే టీతో ఆరోగ్యప్రయోజనాలు వస్తున్నాయంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అయితే ఇది రోటీన్​ టీలకు పూర్తిగా భిన్నమైనది. సహజమైనది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన ఈ టీ రోజువారీ మల్టీవిటమిన్​లాగా పనిచేస్తుంది. దీనిని హెర్బల్ టీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దీనిని ఓ చెట్టు ఆకులతో తయారు చేస్తాము. ఈ టీతో మీరు చర్మ, దంత, హెయిర్, ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.

కావాల్సిన పదార్థాలు:- మునగ ఆకులు – ఎండినవి, తేనె – 1 టీస్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పు. తయారీ విధానం:- మీరు ముందుగా స్టవ్ వెలిగించి దానిలో నీళ్లు వేసి మరిగించాలి. అవి బాగా కాగిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. దానిలో మునగ ఆకులు వేసి ఓ 5 నిమిషాలు మూత వేసి పక్కనపెట్టేయండి. తర్వాత వడకట్టి దానిలో తేనె కలిపి తాగేయడమే. మీరు దీనితో గ్రీన్ టీ ఆకులు కూడా జత చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న మీరు దీని ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. మునగ ఆకుల టీని ముఖ్యంగా చలికాలంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ కణాలకు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి విముక్తినిస్తుంది.

అంతేకాకుండా ఇది పోషకాలకు వనరు. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం పిల్లలకు కూడా దీనిని ఇవ్వొచ్చు. దీనిలోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఇన్​ఫెక్షన్లకు గురి కాకుండా చేస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రయోజనాలు అందిస్తాయి. మధుమేహంతో బాధపడేవారికి మునగాకుల టీ ఓ వరం. ఈ ఆకులు ఇన్సులిన్ చర్యను పెంచడంలో, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తపోటును తగ్గించి.. గుండెకు రక్షణ అందిస్తుంది. కాలేయ సంరక్షణ కోసం కూడా దీనిని మీ రోటీన్లో చేర్చుకోవచ్చు. కిడ్నీ సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ మునగాకులు బాగా పనిచేస్తాయి.

కాలేయం, ప్యాంక్రియాటిక్, బ్రెస్ట్ క్యాన్సర్ సహా పలు రకాల క్యాన్సర్​లతో పోరాడడంలో హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని రోజూ ట్రై చేయవచ్చు. దీనిలోని క్లోరోజెనిక్ ఆమ్లం బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఊబకాయంతో బాధపడేవారు, బరువు తగ్గడానికి సమర్థవంతమైన మార్గాలకోసం చూస్తున్నవారు దీనిని ఫాలో అవ్వొచ్చు. గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, రక్తహీనత, దంత ఇన్ఫెక్షన్లు, హైపర్ టెన్షన్ ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం మునగాకు టీని తాగొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker