News

మీ ఖాతాలో రూపాయి లేకున్నా..! ఏటీఎం నుంచి రూ.10వేలు తీసుకోవచ్చు. ఎలాగో చూడండి.

జన్ ధన్ ఖాతా ఉన్న వ్యక్తి ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, అతను రూ.10,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు అతను ఈ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. ఓడీ కేవలం రూ.10,000 మాత్రమే కావడం గమనార్హం. చాలా బ్యాంకులు ఈ మొత్తానికి మించి ఓడీ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం కూడా మీరు చూసుకోవాలి. అయితే దేశ ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్‌ వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఇక మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన పథకం ఒకటి. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, ఆగస్టు 28 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద లబ్దిదారులు పోస్టాఫీసులు, ప్రభుత్వ, పైవేట్‌ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయవలసిన అవసరం లేదు. అంతేకాదు జన్‌ ధన్‌ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్‌ చేసి లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నారు. రూ.10 వేల వరకు విత్‌డ్రా.. అలాగే ఈ ఖాతా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

ఇందులో బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఖాతా నుంచి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కాకుండా రూపే డెబిట్ కార్డ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ డెబిట్‌ కార్డుద్వారా మీరు ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు. కొనుగోళ్లు కూడా నిర్వహించవచ్చు. ఈ జన్ ధన్ యోజన కింద10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కూడా ఖాతాను తెరవవచ్చు. రూ.2 లక్షల ప్రమాద బీమా.. ఈ పథకం కింద ఖాతా తెరిచినప్పుడు మీరు రూపే ATM కార్డ్, రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల జీవిత బీమా, డిపాజిట్ మొత్తంపై వడ్డీ పొందుతారు.

మీరు దీనిపై 10 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ఖాతాను ఏ బ్యాంకులోనైనా తెరవవచ్చు. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌ ఏదో ఒకటి ఉండాలి. మీకు ఈ పత్రాలు లేకపోతే మీరు చిన్న ఖాతాను కూడా ఓపెన్ చేసే సౌకర్యం ఉంది. ఇందులో మీరు బ్యాంకు అధికారి ముందు ఒక ఫోటో, ఫారమ్‌ నింపి సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఎలాంటి రుసుము లేదా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు.

ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయం గతంలో రూ.5000 ఉండగా, దానిని కేంద్ర ప్రభుత్వం రూ.10,000 పెంచింది. భారతదేశంలో నివసించే పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు.ఈ ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కోసం గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి, మీ జన్ ధన్ ఖాతా తెరిచి కనీసం 6 నెలలై ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker