News

ప్రజలకు హెచ్చరిక, ఇప్పటి నుంచి 3నెలల వరకు చికెన్ తినకండి, ఎందుకో తెలుసా..?

బర్డ్ ఫ్లూ వైరస్.. పక్షులతో వ్యాపారం చేసేవాళ్లు, కోళ్ల ఫారం నడిపేవారు ఎక్కువగా వాటితో గడపాల్సి వస్తుంది. అలాంటివారికి ఈ వైరస్ సోకి అవకాశం ఉంది. అయితే ఈ వైరస్ కారణంగా మనుషులు మరణించే శాతం మాత్రం చాలా తక్కువ. అయితే నాన్ వెజ్ లవర్స్ కి ఇదో షాకింగ్ న్యూస్. వీకెండ్ మాత్రమే మాంసాహారం తినే వాళ్లు ఎక్కువగా ఉంటారు. అదే వారంలో చాలా రోజులు చికెన్ తినడానికి ఇష్టపడే వాళ్ల సంఖ్య కూడా అంతే ఉంటుంది. అలాంటి వాళ్లకు ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

వారంతో పని లేకుండా తినే మాంసాహారంలో చికెన్ మొదటి స్థానంలో ఉంటుంది. కాని ఇప్పుడు మాత్రం చికెన్ తినడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు అధికారులు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తృతంగా వ్యాపించింది. వారం రోజుల క్రితం నెల్లూరు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు ఫారాల్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రభావం విజయవాడలో తీవ్రంగా కనిపిస్తోంది. పె ద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కృష్ణ, గోదావరి, నెల్లూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు అధికారులు.

కోళ్లు మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీ పశువర్ధన శాఖకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. ఫిబ్రవరి 7 న ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 10,000 పౌల్ట్రీ పక్షులు మరణించినట్లు భావిస్తున్నారు. మూడు నెలల పాటు ప్రజలు చికెన్ తినకపోవడమే మంచిదని సూచనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చికెన్ షాపులను మూసివేయలని భావిస్తున్నారు అధికారులు.దీనిపై చర్యలు చేపట్టేలా కీలక ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలోనూ ఎన్నో లక్షల సంఖ్యలో కోళ్లు ఈ వైరస్ బారిన పడి మృతి చెందినట్లు నిర్థారించారు. వైరస్‎ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు.

జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరాలని సూచించారు. నెల్లూరు జిల్లాలోని పలు కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. వైరస్ కారణంగా జిల్లాలోని పొదలకూరు, కోవూరు, సైదాపురం ప్రాంతాల్లో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్ ల్యాబ్‌కు పంపించారు.5N1 వైరస్ వేరియంట్ ఉనికిని నిర్ధారణకు వచ్చారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker