News

శైలజతో విడాకులు అంటూ ఫేక్ వార్తలు, కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్.

యూట్యూబ్ లో “సుధాకర్ కు అపాయింట్మెంట్ ఇవ్వని చిరంజీవి”, “శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్” ఇలా ఆయనపై థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో వీటిపై సుధాకర్ స్పందిస్తూ.. “చిరంజీవికి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. బాల సుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నపుడు .. ఆయన నిత్యం నాతో కాల్స్ మాట్లాడుతూనే ఉండేవారు. మెగాస్టార్ నా మొదటి హీరో. ఈ యూట్యూబ్ వాళ్ళు చాలా ఏళ్లుగా నా గురించి తప్పుగానే చూపిస్తున్నారు.

33 సంవత్సరాలుగా తను శైలజ విడిపోయామని సోషల్ మీడియాలో రాస్తూనే ఉన్నారని.. ఆ విషయంపై ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూల్లో, పక్క పక్కన కూర్చుని మాట్లాడినప్పుడు కూడా క్లారిటీ ఇచ్చామని సుధాకర్ అన్నారు. అయినా ఇప్పటికీ అదే రాతలు రాస్తున్నారని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఒకానొక సందర్భంలో తన తల్లి ‘శైల నువ్వు బాగానే ఉన్నారా?’ అని ప్రశ్నించారని.. అలాంటిదేమీ లేదని నేను చెప్పిన మర్నాటి ఉదయం అమ్మ కాలం చేసారని.. ఆవిడ మనసులో భయం,

లేదా అనుమానం పెట్టుకుని చనిపోయారా? అనే బాధ ఇప్పటికీ తనలో ఉందని సుధాకర్ చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తనపై, తన భార్యపై పెద్దగా ప్రభావం చూపించకపోయినా తన కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి కదా అని ప్రశ్నించారు. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన సందర్భంలో కూడా చిరంజీవి తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని రాసారని.. నిజానికి 54 రోజుల పాటు ప్రతిరోజు చిరంజీవి తనకు ఫోన్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేవారని సుధాకర్ చెప్పారు.

ఈ మధ్య వీడియోల్లో తను చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయని.. ఇలాంటి వార్తలు రాయడం వల్ల ఏం కలిసి వస్తుందని సుధాకర్ ప్రశ్నించారు. శరీరం అమ్ముకుని బతికే స్త్రీలకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయని అంతకంటే దారుణంగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇలాంటి వీడియోలు చేసేవారు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారంటూ తీవ్రమైన ఆవేదనతో శుభలేఖ సుధాకర్ మాట్లాడారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker