Health

మీ పిల్లలకు ఈ వయసులోనే ఈ ఫుడ్స్ ని తినిపిస్తే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.

మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తాయి. అలాగే ఒత్తిడి, భయాన్ని దూరం పెట్టాలి. లేదంటే మానసికంగా కృంగి డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఉంది. మనం సరైన ఆహారం, జాగ్రత్తలు తీసుకుంటేనే బ్రెయిన్ యాక్టీవ్ గా, షార్ప్ గా పని చేస్తుంది. లేదంటే ఇన్ ఫ్లమేషన్ కు కారణం అయ్యే సైటోకైన్స్ విడుదలై మెదడు పని తీరును దెబ్బతీస్తుంది. అయితే సాధారణంగానే పిల్లలు చదువుపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టరు. వాళ్ల వయసులో ఆడుకోవడంపైనే ధ్యాస ఉంచుతారు. దీంతో చదివింది కూడా మర్చిపోతూంటారు.

దీంతో తల్లిదండ్రులు వారిపై తిట్టడం లేదా కొట్టడం చేస్తూంటారు. పిల్లలకు మనం పెట్టే ఆహారమే మెదుడపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం కూడా పేరెంట్సే. చిన్నప్పటి నుంచి వాటిని తినిపించడం వల్ల పిల్లల్లో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి పిల్లలకు పెట్టే ఆహారంపై శ్రద్ధ ఉంచడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచే ఆహారాలు పెట్టడం చాలా అవసరం.

ఇవి తీసుకోవడం వల్ల పిల్లలు యాక్టీవ్ గా ఉంటారు. గుడ్లు:- ఎదిగే పిల్లలకు రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డు పెట్టడం చాలా అవసరం. వీటిల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ బీ6 వంటివి.. జ్ఞాపక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. అదే విధంగా గుడ్డు తినడం వల్ల పిల్లలు బలంగా, దృఢంగా ఉంటారు. గుడ్డును ఎలా పెట్టినా.. దానిలోని పోషకాలు అందుతాయి.

బ్లూ బెర్రీస్:- బ్లూ బెర్రీస్ గురించి అందరికీ తెలుసు. బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. అలాగే పిల్లల్లో ఇమ్యూనిటీ లెవస్స్ కూడా పెరుగుతయాయి. డ్రైఫ్రైట్స్:- పిల్లలకు ప్రతిరోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ పెట్టడం చాలా మంచిది. వీటి వల్ల బ్రెయిన్ యాక్టీవ్ గా ఉంటుంది. అంతే కాకుండా బలంగా, దృఢంగా ఉంటారు. అలాగే నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

చేప:- కొన్ని రకాల చేపల్లో మంచి కొవ్వులు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇలాంటి తినడం వల్ల మెదడు యాక్టీవ్ గా పని చేస్తుంది. అలాగే హెల్దీగా ఉంటారు. గుమ్మడి విత్తనాలు:-చాలా మంది గుమ్మడి కాయ విత్తనాలను పడేస్తూంటారు. అలా కాకుండా వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ ని, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచడంతో పాటు బ్రెయిన్ ని చురుగ్గా చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker