బలహీనమైన స్పెర్మ్ కౌంట్ ఉన్న పురుషులు కూడా పిల్లల్ని కనొచ్చు, ఎలానో తెలుసుకోండి.
చాలా మంది శుక్రకణాల లోపాలతో బాధపడుతున్నారు. దీని వల్ల సంతానం కోసం ఎదురుచూసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాప్యం కలుగువచ్చు. కొందరిలో బలహీనమైన స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ మొత్తంలో ఉండడమనేది.. మనం తినే ఆహారం, వాతావరణ మార్పులపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే ఈ రోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సంతానలేమితో కూడా ఎంతో మంది బాధపడుతున్నారు.
ఎన్నో మందులు వాడుతూ చికిత్స తీసుకున్నా కొందరికి సంతానం కలుగక తీవ్ర మనోవేధనకు గురవుతుంటారు. ఇక తండ్రిగా మారడం, అతని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది పురుషులది కీలక పాత్ర. కానీ కొన్నిసార్లు కొన్ని జంటలు ఇందులో విజయం సాధించవు. వైద్య పరిభాషలో వంధ్యత్వం దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రోజుల్లో పురుషులలో సంతానలేమి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
మనం దీనిని వైద్య పరిభాషలో అర్థం చేసుకుంటే, పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం. అయితే వీర్య కణాల సంఖ్య బలహీనంగా ఉన్న పురుషులు కూడా తండ్రులు కావచ్చని తాజా పరిశోధన పేర్కొంది. మెడికల్ లైఫ్ సైన్స్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. చాలా సందర్భాలలో తక్కువ సంతానోత్పత్తి ఉన్న పురుషులు కూడా వారి స్త్రీ భాగస్వామి ఆరోగ్యంగా ఉంటే బిడ్డకు జన్మనివ్వడంలో విజయం సాధిస్తారు. అయినప్పటికీ ఈ అధ్యయనం పురుషుల వంధ్యత్వానికి సంబంధించిన మంచి అవగాహన గురించి కూడా చెబుతుంది.
పురుషులలో సంతానలేమి సమస్య కారణంగా గర్భం దాల్చడం సాధ్యం కాదు. పురుషుల్లో ఈ సమస్యకు సంబంధించిన సమస్యను సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పరిశోధనలో ఏం బయటపడింది.. పురుషుల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్యకు అనేక కారణాలున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. వీటిలో పర్యావరణంలో మార్పులతో సహా అనేక అంశాలు ఉన్నాయి. అయితే పురుషులలో పెరుగుతున్న సంతానలేమి సమస్యను అధిగమించడానికి, మెడికల్లీ అసిస్టెడ్ రిప్రొడక్షన్ (MAR) టెక్నాలజీ వినియోగం కూడా పెరిగింది.
ఇది ఒక రకమైన వైద్య ప్రక్రియ, దీని ద్వారా పురుషుల బలహీనమైన స్పెర్మ్ కౌంట్ బలపడుతుంది. పురుషులు ఏమి చేయాలి.. పురుషులలో వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ముందు, వైద్యుడికి పూర్తి వివరాలు తెలియజేయాలి. దాని ఆధారంగా మీకు చికిత్స అందిస్తారు. ఏదైనా శస్త్రచికిత్స చేసే ముందు, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి సహజ పద్ధతులను సిఫార్సు చేస్తారు. ఊబకాయం- పురుషుల్లో వంధ్యత్వానికి స్థూలకాయం కూడా కారణం.
దీని కారణంగా ఆండ్రోజెన్ మరియు టెస్టోస్టెరాన్ జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచే హార్మోన్లు ఇవి. వయస్సు కూడా ఒక కారణం – ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జంటలు కూడా గర్భం దాల్చడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. 35 తర్వాత పురుషులు, మహిళలు ఇద్దరి జీవ గడియారం ప్రభావితమవుతుంది. అంతే కాకుండా ధూమపానం, మద్యపానం కూడా దీనికి కారణం.