Health

సీతాఫలాలను ఇష్టంగా ఎగబడి తినేవారికి బిగ్ షాక్, అసలు విషయమేంటంటే..?

సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీలవరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాముల.. విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ నాలుగు శాతం, సోడియం పది మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండింటిని తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది. అయితే సీతాఫలాలతో అనే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపుతాయి. ఫ్రీ రాడికల్స్ కారణంగా కణాల వినాశనంతో ఎదురయ్యే వృద్ధాప్యం, ఇతర వైద్య సమస్యలను ఈ పోషకాలు దూరం చేస్తాయి.

సీతాఫలంలో వాటర్ కంటెంట్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్, ట్రిప్టోఫాన్, లైసిన్, మెథియోనిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడుతూ, అనారోగ్యాల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఐతే సీతాఫలాలను ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు, అధిక బరువు, అలర్జీల రిస్క్ పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇవి ప్రమాదకరం. అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకం వంటి అనారోగ్యాల బారిన పడవచ్చు.

సీతాఫలాలను అధికంగా తింటే, కొందరు అసాధారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ పండ్ల నుంచి పెద్దమొత్తంలో కేలరీలు శరీరానికి అందుతాయి. ఫలితంగా స్థూలకాయం బారిన పడవచ్చు. ఈ సమస్య కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం సైతం పెరుగుతుంది. అందుకే కస్టర్డ్ యాపిల్స్‌ను పరిమితంగానే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సీతాఫల పండ్లను అతిగా తింటే అజీర్ణం, కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు ఎదురు కావచ్చు. ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది.

ఈ పండు తిన్న తర్వాత వికారం లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురైతే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. సీతాఫలాలను ఎక్కువగా తింటే, రక్తంలో చక్కెర స్థాయులు పెరగవచ్చు. ఫలితంగా గ్లూకోజ్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇది హైపర్గ్లైసీమియాకు దారితీస్తుంది. షుగర్ పేషెంట్లకు ఈ కండిషన్ ప్రమాదకరంగా మారుతుంది. అలసట, ఎక్కువ సార్లు మూత్రవిసర్జన, అధిక దాహం, కంటి చూపు తగ్గడం.. వంటివన్నీ హై షుగర్ లెవల్స్‌ను గుర్తించే లక్షణాలు. దీన్ని కంట్రోల్ చేయకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంది.

కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. కొందరిలో సీతాఫలం వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇవి అలర్జీ రియాక్షన్స్‌కు కూడా కారణమవుతాయి. ఫలితంగా నోట్లో లేదా పెదవుల చుట్టూ దురద, వాపు, చర్మంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు, తుమ్ములు, దగ్గు, వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా గురక, తల తిరగడం వంటివి రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. సీతాఫలం తినడం మానేయాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker