68 ఏళ్ళ వయసులో జిమ్‌లో మెగాస్టార్ మెగా కసరత్తులు. వైరల్ అవుతున్న వీడియో
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/02/chirugym654123-780x470.jpg)
చిరు ఎంత బాగా నటించినా.. ఈ 60లలో వృద్ధ్యాప్య ఛాయలు, అలాగే.. కుర్ర హీరోగా నటించాలంటే.. ఆమాత్రం స్టామినా కావాలి కదా. దీంతో.. మెగాస్టార్.. జిమ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం చిరు జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన చూసిన అభిమానులు, ప్రేక్షకులు సైతం షాక్ అవుతున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.
విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అంటూ జిమ్ లో కష్టపడుతున్న వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి జిమ్ లో బాగా కష్టపడుతున్నారు. జిమ్ లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్నారు. ఈ వీడియోలో చిరంజీవి జిమ్ లోకష్టపడటం చూసి 68 ఏళ్ళ వయసులో జిమ్ లో ఈ రేంజ్ లో కష్టపడుతున్నారని అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతైనా కష్టపడతారు.
ఇలా విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ కష్టపడటం చూసి సినిమా, ఆడియన్స్ కోసం మెగాస్టార్ ఇంత కష్టపడుతున్నారు అంటూ అభినందిస్తున్నారు. త్వరలోనే చిరంజీవి విశ్వంభర షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇక విశ్వంభర సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు చిత్రయూనిట్. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
గత నాలుగు రోజులుగా ఎవరో ఒకరు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందిస్తూనే ఉన్నారు. త్వరలోనే చిరంజీవిని అభినందిస్తూ ఓ సన్మాన సభ టాలీవుడ్ తరపున చేయనున్నారు.
Gearing up .. And raring to go #Vishwambhara pic.twitter.com/VeUj0yhN35
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2024