Health

ఎండిపోయిన నిమ్మకాయలను అలా చేసి వాడితే ఆ సమస్యలన్నింటినీ మాయం చేసుకోవచ్చు.

సమ్మర్‌లో నిమ్మకాయలు విరివిగా దొరుకుతాయి. డిమాండ్ ఎక్కువ. ధర కూడా ఎక్కువగా ఉంటాయి. సీజన్ మారగానే వాటి వాడకం కాస్త తగ్గిస్తుంటాం. ఇంట్లో ఒక్కోసారి వాడకపోవడం వల్ల ఎండిపోతుంటాయి. అలాంటి వాటిని బయట పారేస్తుంటాం. ఎండిన నిమ్మకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్, చక్కెర, పిండి పదార్థాలు, డైటరీ ఫైబర్, కొవ్వు మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే నిమ్మ రసం తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

వేసవి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే నిమ్మ కాయలు ఇంటికి తీసుకొచ్చాక ఎక్కువ కాలం నిల్వ ఉండవు. త్వరగా పాడైపోతాయి. ఇలా ఎండి పోయిన నిమ్మ కాయల్ని బయట పారేస్తూ ఉంటారు. కానీ వాటితో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోహకాహార నిపుణులు చెబుతున్నారు. ఎండిన నిమ్మ కాయల్లో పోషకాలు:- ఎండిన నిమ్మ కాయల్లో మెగ్నీషియం, విటమిన్ సి, ఐరన్, జింక్, ఐరన్, పొటాషియం, ఫైబర్, చక్కెర, కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయట.

ఎండిన నిమ్మకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు:- ఎండిన నిమ్మకాయల్లో పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఎండిన నిమ్మకాయల్ని ఉపయోగించుకోవచ్చు. శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయ పడుతుంది. అధిక కొవ్వు ఉన్నవారు ఎండు నిమ్మకాల్ని యూజ్ చేయవచ్చు. ఎండిన నిమ్మకాయ పొడిని తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య నుంచి బయట పడొచ్చు. ఎండిన నిమ్మ కాయలను తీసుకోవడం వల్ల అలసట, నీరసం దరి చేరవు.

లో బీపీ ఉన్న వారు కూడా ఎండిన నిమ్మకాయలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు కూడా ఈ నిమ్మ కాయ తీసుకోవడం వల్ల ఎన్నో లాభలు ఉన్నాయి. ఎండిన నిమ్మ కాయల్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలతోపాటు మలబద్దకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఎండిన నిమ్మకాయల పొడిని చర్మానికి కూడా రాసుకోవచ్చు. దీని వల్ల చర్మం క్లియర్‌గా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker