News

45 ఏళ్ల వయసులో ప్రేమించిన అమ్మాయితో ప్రముఖ కమెడియన్ పెళ్లి. ఆ అమ్మాయి ఎవరంటే..!

రమ్య తెలుగులో సంతోష్ శోభన్ నటించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీలో నటించింది. తాప్సీ నటించిన ‘గేమ్ ఓవర్’ తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంలో కూడా నటించింది. ఈమె కమెడియన్ ప్రేమ్ జీకి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఈ వేడుకకు వెళ్లారు. వధూవరులతో కలిసి దిగిన ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ప్రేమ్‏జీ ప్రముఖ డైరెక్టర్, సంగీత విద్వాంసుడు గంగై అమరన్ కుమారుడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉన్న ప్రేమ్‏జీ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా వద్ద సహాయకుడిగా తన కెరీర్ ప్రారంభించాడు.

ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా మరారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో ప్రేమ్‏జీ చాలా వరకు ర్యాప్ సాంగ్స్ పాడారు. అళాగే సౌండ్ ట్రాక్ ఆల్బమ్స్ కోసం తన కంపోజిషన్‌లలో కొన్నింటిని రీమిక్స్ చేశాడు. 2006లో సిలంబరసన్ తెరకెక్కించిన వల్లవన్ చిత్రంలో కీలకపాత్ర పోషించి నటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అతడి సోదరుడు తెరకెక్కించిన చెన్నై 600028 చిత్రంలో నటించాడు.

ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా కమెడియన్ పాత్రలో ప్రేమ్‏జీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అనేక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు కమెడియన్ గా.. మ్యూజిక్ కంపోజర్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రేమ్‏జీ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వినిపించాయి.

ఇందుకు సంబంధించి వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు ప్రేమ్‏జీ పెళ్లి ఫోటోస్ నెట్టింట దర్శనమిచ్చాయి. వీరిద్దరి వివాహానికి యువ హీరోలు జై, వైభవ్ హాజరయ్యారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker