News

రెండో పెళ్లికి రెడీ అవుతున్న రేణు దేశాయ్, ముహూర్తం ఎప్పుడో తెలుసా..?

పుణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా రేణు దేశాయ్‌ విడుదల చేశారు. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు సైతం పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటరిచ్చింది. మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ.. నేను చేసుకుంటే తప్పా అంటూ అభిమానులను ప్రశ్నించింది. అయితే పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి బోలెడన్ని వార్తలు షికారు చేశాయి.

దీంతో ఆమెపై పవన్ ఫ్యాన్స్ అటాక్ చేశారు. రేణు రెండో పెళ్లిని తప్పుబడుతూ ట్రోల్ చేశారు కూడా. అయినప్పటికీ అవేవీ పెద్దగా పట్టించుకోలేదు రేణు. ఈ నేపథ్యంలోనే రెండో పెళ్లిపై ఓపెన్ కామెంట్స్ చేస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది రేణు దేశాయ్. 12ఏళ్లుగా సింగిల్‌గా ఉంటున్న ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. త్వరలోనే అందుకు ముహూర్తం ఉంటుందని అనేసింది. తన కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్యల పోషణ, స్టడీస్‌ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న రేణు.. కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది‌.

మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా మ్యారేజ్‌ చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. ఇన్నేళ్లయినా ఇప్పటికీ సెకండ్ మ్యారేజ్‌ చేసుకోకపోవడానికి అసలు కారణాలను కూడా చెప్పింది రేణు. మరో రెండు మూడేళ్లలో పిల్లలు పెద్ద అవుతారు. కాలేజ్‌కి వెళ్తారు. అప్పుడు వాళ్ళకు పూర్తి మెచూరిటీ వస్తుంది. కేవలం సపోర్టింగ్‌ కోసమే పేరెంట్స్ అవసరం అవతారు. కాబట్టి అప్పుడు నేను ఫ్రీ అవుతాను. అదే సమయంలో రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది రేణు.

కాగా.. పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో రేణు దేశాయ్‌ పాజిటివ్‌గా స్పందించింది. కొడుకు అకీరాను పవన్ వెంటే ఉంచుతూ జనాల్లో హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. దీంతో ఇప్పుడు రేణు దేశాయ్- పవన్ కళ్యాణ్ మ్యాటర్స్ మరోసారి చర్చల్లో నిలుస్తున్నాయి. కెరీర్ పరంగా కూడా చాలా గ్యాప్ తీసుకున్న రేణూ దేశాయ్.. ఇటీవల టైగర్‌ నాగేశ్వరరావులో నటించింది. టీవీ షోస్‌లో జడ్జ్ గా అలరించింది. సెకండ్ ఇన్నింగ్స్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker