మీ చెవులను కాటన్ బడ్స్‌తో శుభ్రపరుస్తున్నారా..? మీకో షాకింగ్ న్యూస్.

చెవులను శుభ్రపరిచేందుకు లేదా చెవిలో గులిమి తీసేందుకు చిటికెన వేలు, కాటన్ బడ్స్ ఉపయోగించడం మంచి పద్దతి కాదని వైద్య నిపుణులు అంటున్నారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా చెవిలో గులిమిని తీసుకునేందుకు మనం కాటన్ బడ్స్ ఉపయోగిస్తాం. అయితే వాటిని ఉపయోగించడం వల్ల చెవుల్లో గులిమి ఇంకా లోపలికి వెళ్తుంది. కాటన్ బడ్స్ వాడటం వల్ల మీకు చెవుల్లో దురద నుంచి కాస్త ఉపశమనం పొందినా.. గులిమి శుభ్రపడదు.
అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కాటన్ బడ్స్ తరచుగా వినిపయోగించడం వల్ల గులిమి బయటకి రాకపోగా మరింత లోపలికి వెళ్ళిపోతుంది. జిగటగా మెత్తగా ఉండే ఈ పదార్థం గట్టిగా మారిపోయి అడ్డంకిగా మారవచ్చు. దీని వల్ల వినికిడి లోపం లేదంటే శాశ్వతంగా వినిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ గుమిలి వల్ల చెవిపోటు వస్తుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తుంది. సున్నితమైన ఈ ప్రాంతంలో గట్టి వస్తువులు పెట్టడం వల్ల రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.
దీన్ని ఎదుర్కోవడం కష్టం. ఒక్కోసారి అంతర్గత గాయాలు ఏర్పడతాయి. చెవి ఇన్ఫెక్షన్ లక్షణాలు.. చెవి పోటు, చెవిలో రింగింగ్ శబ్దాలు, వినికిడి మందగించడం, చెవి నుంచి దుర్వాసన, తరచూ మైకం, దీర్ఘకాలిక దగ్గు. చెవులకు గుమిలి అవసరమేనా.. చెవుల్లోకి దుమ్ము, బ్యాక్టీరియాయ, ఇతర సూక్ష్మ క్రిములు, చిన్న వస్తువులు లోపలికి పోకుండా ఉండేందుకు గుమిలి సహాయపడుతుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీరు లోపలికి పోకుండా అడ్డుకోవడంలో ఇది రక్షణ గోడలా పని చేస్తుంది.
అందుకే చెవిలో ఉండే వ్యాక్స్ వదిలించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఇయర్ వాక్స్ దాన్ని అదే సహజంగా శుభ్రం చేసుకుంటుంది. దాన్ని ప్రత్యేకంగా తీసివేయాల్సిన అవసరం లేదు. హార్వర్డ్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం చెవిలో గులిమి ఉంటే అది అనారోగ్యకరమని అర్థం కాదు. ఇది సహజమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. చెవి లోపల చర్మం పొడిగా మారకుండా చేస్తుంది. చెవిలోకి చేరే దుమ్ము, ధూళిని పోకుండా అడ్డుకుంటుంది. డెడ్ స్కిన్ సెల్స్, చెత్త పోకుండా నిలువరిస్తుంది.
కాటన్ బడ్స్ ఉపయోగించకుండా చెవులు శుభ్రం చేసుకోవడం ఎలా.. తడి వస్త్రంతో క్లీనింగ్.. కాటన్ బడ్స్ గులిమిని లోపలికి నెట్టేస్తాయి. అందుకే వాటిని చెవి వెలుపల మాత్రమే శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించాలి. చెవి లోపల ప్రదేశాన్ని క్లీన్ చేసుకునేందుకు తడి లేదా వెచ్చని వస్త్రంతో తుడవడం మంచిది. క్లీనింగ్ డ్రాప్స్.. చెవులని క్లీన్ చేసేందుకు మార్కెట్లో ఓవర్ ది కౌంటర్ క్లీనింగ్ డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. సహజమైన ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారు. వీటిని చెవులో వేసుకుంటే క్లీన్ అయిపోతాయి. బల్బ్ సిరంజ్.. సిరంజ్ ఉపయోగించి చెవిలో నీటిని పంపించొచ్చు. ఈ నీటితో చెవులు శుభ్రపడతాయి.