ఉదయాన్నే చద్దన్నం తింటే ఎంత మంచిదో తెలిస్తే రోజు తింటారు.

ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఏది పడితే అది తినడము,టైం లేదంటూ అసలే బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉంటారు.రోజంతా మన మెదడు పనితీరు కూడా మన మనం తినే అల్పాహారం మీద ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. అందుకే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తినడం అలవాటు చేసుకోవాలి.మరీ ముఖ్యంగా వేసవిలో చద్దన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు తినకుండా వదలరు. అయితే మనం పెరుగన్నం తింటాం.
రుచితోపాటు ఆరోగ్యానికి మంచిది కాబట్టే రోజు తింటాం. ఎండాకాలంలో అయితే చలువ కోసం పెరుగు తింటాం. చల్ల తాగుతాం. దీని వల్ల మనకు అనేక ప్రయోజనాలున్నాయి. పెరుగన్నం తింటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఎవరు వదిలిపెట్టరు. మన ఆరోగ్య సంరక్షణలో పెరుగు కీలకమైనది. అందుకే దక్షణ భారతదేశంలో పెరుగు వాడకం పెరిగిపోయింది.
పెరుగు ఒక ప్రొబయోటిక్ పాల ఉత్పత్తి అనుకుంటారు కానీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది అత్యంత సహాయకారిగా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. అజీర్తిని దూరం చేస్తుంది. కడుపు మంట, మలబద్ధకం సమస్యలు లేకుండా చేస్తుంది. కడుపులో ఎలాంటి మలినాలు లేకుండా శుభ్రం చేస్తుంది.
అందుకే పెరుగన్నం తినడం వల్ల మన ఒంట్లో రోగాలన్ని మాయమవుతాయి. పెరుగన్నం వేసవిలో ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రొబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు కొవ్వులను దూరం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అధిక బరువు నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారమే.
ఇలా పెరుగుతో అన్నం తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి మిగిలిన అన్నం పొద్దున పెరుగుతో కలుపుకుని తింటే ఇంకా ప్రయోజనాలున్నాయి. నిలువ ఉన్న వాటిలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనకు అవసరమైన ప్రొటీన్లు అందేలా చేస్తుంది. చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే మన అనారోగ్యాలు దూరమవుతాయి తెలుసా. ఇంతటి సులభమైన చిట్కాను అందరు ఉపయోగించుకుని లబ్ధిపొందాల్సిన అవసరం ఉంది.