ఈ మొక్క వేర్లు ఎంత లాభం చేస్తాయో తెలిస్తే జీవితంలో మర్చిపోరు.

మన పూర్వీకులు దీనిని విరివిరిగా ఔషధంగా వాడే వారు. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ఇది బహువార్షిక తీగ మొక్క. ఈ మొక్క సుమారు 6 మీటర్ల వరకు పెరుగుతుంది. సుగంధి పాల మొక్క వేరు చక్కని సువాసనను కలిగి ఉంటుంది. ఈ వేరును శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించగా ఎర్రని కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
అయితే మన ప్రకృతిలో మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. వాటితో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యం కాపాడే మొక్కల్లో సుగంధిపాల ఒకటి. దీంతో మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కో మొక్క ఎన్నో రకాల లాభాలు కలిగిస్తుంది. ఇలా సుగంధిపాల మొక్క ఆయుర్వేదంలో చాలా రకాల సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు.
ఆయుర్వేదంలో వీటికి మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఆకు రాల్చే మొక్కలకు చెందినది ఇది. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. సుగంధిపాల మొక్క వేర్లతో మనం మందులు తయారు చేసుకోవచ్చు. దీంతో రుమటిజం, చర్మ సమస్యలు, మూత్ర సంబంధమైన వ్యాధులు, జ్వరం, వికారం, వాంతులు, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.
సుగంధిపాల మొక్క వేర్లను కట్ చేసి మెత్తని పేస్టుగా చేసుకుని నుదురు మీద పట్టులాగా వేస్తే జ్వరం, వేడి, తలనొప్పి తగ్గుతాయి. చర్మం మీద దురద ఏర్పడినప్పుడు ఈ మిశ్రమాన్ని రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సుగంధిపాల వేర్లతో తయారు చేసిన కషాయాన్ని తాగితే దగ్గు, ఉబ్బసం, మూర్చ వ్యాధి వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇలా సుగంధిపాల మొక్కను ఉపయోగించుకుని మనం పలు రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆయుర్వేదంలో దీనికి మంచి గుర్తింపు ఉంది. మనకు మాత్రం దీని గురించి తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ దీని ప్రయోజనాలు తెలుసుకుని వాడుకుంటే మనకు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. సుగంధిపాల మనకు చాలా మేలు చేస్తుంది.