రూపాయి ఖర్చులేకుండా కడుపు ఉబ్బరాన్ని కేవలం 5 నిమిషాల్లోనే ఇంటి చిట్కాలు.
కడుపు ఉబ్బరం అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది సాధారణంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ లో గ్యాస్ ఏర్పడటం వలన సంభవిస్తుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. అత్యంత సాధారణమైనది తినే ఆహారం. కొన్ని సింపుల్ హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా ఉబ్బరం నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల చాలా మందిలో పొట్ట సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు వేసవిలో రెట్టింపు అవుతాయి.
దీని కారణంగా జీర్ణక్రియ కూడా దెబ్బతిని ఊబకాయం సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో కడుపు ఉబ్బరం సమస్యలు రావడం సర్వసాధరమైపోయాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా మార్కెట్‌లో లభించే ఔషధాలు వినియోగిస్తున్నారు. కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారా?
పెరుగు, పుదీనా.. పెరుగు, పుదీనా ఆహారాల రుచి రెట్టింపు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వేసవిలో వీటిని తరచుగా ఆహారాలో వినియోగించడం వల్ల శరీరం చల్ల దనంగా మారుతుంది. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్‌లు చురుకుగా మారుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తిన్న తర్వాత ఇలా చేయండి.. చాలా మందిలో ఆయిల్ ఫుడ్స్ అతిగా తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరం సమస్యలు వస్తాయి.
ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తిన్న 30 నిమిషాల తర్వాత నిమ్మరసం తాగితే సులభంగా పొట్ట ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇసాబ్‌గోల్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.. వేసవి కాలంలో చాలా మంది అపానవాయువు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో లూజ్ మోషన్స్ కూడా అవుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఇసాబ్‌గోల్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంగువ కూడా పొట్టకు మేలు చేస్తుంది.. పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో తప్పకుండా ఇంగువ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జీర్ణక్రియకు మేలు చేసే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. దీంతో పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.