News

కోర్టు సంచలన తీర్పు, బండ్ల గణేష్ కు సంవత్సరం పాటు జైలు శిక్ష.

చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో విచారణ కోసమే నిర్మాత బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన్ని షాక్ కు గురు చేస్తూ తుది తీర్పు వచ్చింది. అయితే 2019 లో ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద 95 లక్షలు తీసుకున్నారట బండ్ల గణేష్.

ఇందుకు గాను పూచీకత్తుగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్కు ఇచ్చారట. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. దీంతో ఆ కేసు విచారించి బండ్ల గణేష్ కు జైలు శిక్ష, జరిమానా విధించింది కోర్టు. గతంలో కూడా బండ్ల గణేష్ ఇలా చెక్ బౌన్స్ కేసులో శిక్ష అనుభవించారు.

టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు రూ.15,86, 550ల జరిమానా విధించడం జరిగింది. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన బండ్లన్న.. ఈ పదేళ్ల పాటు చాలా బాధను అనుభవించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పిన ఆయన.. అప్పటినుంచి తమకు దీపావళి, దసరా పండుగలు వస్తాయని చెప్పడం విశేషం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker