Health

ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టి పని చేస్తున్నారా..! మీరు పిల్లల్ని కనడం కష్టమే.

అవును.. ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేసే ఆడవారు పిల్లల్ని కనడం కష్టమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో.. ల్యాప్ టాప్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మందికి బెడ్‌పై కూర్చుని ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే అలవాటు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగినప్పటి నుంచి చాలామంది ఇంట్లో కూర్చుని ఇలానే వర్క్ చేస్తున్నారు.

అయితే ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ ఒడిలో ల్యాప్‌టాప్‌ పెట్టుకుని.. మంచం మీద అలా పనిచేయడం మీకు సౌకర్యంగా అనిపించవచ్చు.. అనర్థాలు అయితే చాలా ఉన్నాయి. ల్యాప్‌టాప్ నుండి వచ్చే వేడి గాలి చర్మంపై చికాకును కలిగిస్తుంది. దీనిని టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ అంటారు. ల్యాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల చర్మవ్యాధులు వస్తాయి. మీ ఒడిలో ల్యాప్‌టాప్‌తో పని చేయడం పురుషులలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ల్యాప్‌టాప్‌ల నుండి వచ్చే వేడి గాలి స్పెర్మ్ కౌంట్, నాణ్యతను తగ్గిస్తుంది.

లాప్‌టాప్‌ వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్‌లను (మైక్రోవేవ్‌లు) అందుకుంటుంది, అనేక ఫ్రీక్వెన్సీలలో EMFలను విడుదల చేస్తుంది. కాళ్లపై పెట్టుకుని ల్యాప్‌టాప్‌ వాడితే.. మగవారిలో వీర్య కణాలపై ఎఫెక్ట్ పడుతుంది. అలానే మహిళలలో ఎగ్‌ రిలీజ్‌ సమక్రమంగా జరగదు. మీ ఒడిలో ల్యాప్‌టాప్‌ని పెట్టుకుని.. మంచంపై అలా వాలి ఎక్కువసేపు పని చేయడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకున్నారంటే.. నిటారుగా కూర్చోవడం అవ్వద్దు. వంగి లేదా వాలి కూర్చోవాల్సి వస్తుంది.

దీంతో వెన్నుముకపై ఒత్తిడి పడి.. నొప్పికి దారి తీస్తుంది. అలానే మెడపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై ఉంచి పని చేయడం మంచిది. అలానే కంటి సంరక్షణ కోసం, ప్రతి 20-30 నిమిషాలకు విరామం తీసుకోండి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker