Health

పాదాలపై ఆనెలతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే పాదాలలో ఆనెలు ఒక్క రోజులోనే తగ్గిపోతాయి.

ఆనెలు సాధారణంగా పాదాలు, కాలి, వేళ్లు లేదా చేతుల దిగువన ఇబ్బంది పెట్టే విధంగా కాయల్లా తయారవుతాయి. దీనిలో చర్మం చాలా గట్టిగా, మందంగా, నిర్జీవంగా మారుతుంది. ఇవి చాలా బాధాకలిగిస్తాయి. చర్మం స్థిరమైన ఘర్షణకు గురైనప్పుడు కనిపిస్తాయి. అయితే మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఆనెలు సమస్య వల్ల ఇబ్బందులు పడి ఉంటారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల నడవటానికి ఇబ్బందులు పడటంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. పాదాల కింద ఉన్న చర్మం మంటగా అనిపిస్తుంటే ఆనెల సమస్య అయ్యే అవకాశం ఉంటుంది.

ఆనెలకు నిమ్మరసం రాయడం వల్ల తక్కువ సమయంలో ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. వెల్లుల్లిని పేస్ట్ లా చేసి ఆనెలపై అప్లై చేయడం ద్వారా కూడా ఆనెల సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఉల్లిపాయల సహాయంతో కూడా ఆనెల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఉల్లిపాయలను గుజ్జులా చేసి ఆనెలా అప్లై చేస్తే మంచిది. ఉల్లిపాయ రసం అప్లై చేయడం ద్వారా చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. గోరువెచ్చని నీటిలో వంటసోడా వేసి పాదాలను ఉంచితే కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఆనెలపై పైనాపిల్ ముక్కలను రుద్దడం ద్వారా కూడా ఆనెల సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కలబంద పేస్ట్‌తో బ్యాండేజ్ చుట్టడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. తులసి ఆకులను మెత్తగా నూరి ఆనెలకు అప్లై చేయడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. ఆముదం, వెనిగర్ లను అప్లై చేయడం ద్వారా కూడా ఈ సమస్య దూరమయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. పాదాల పగుళ్ల సమస్య విషయంలో మనలో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.

పాదాలను నిరంతరం శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. చెప్పులు లేకుండా ఎక్కువ దూరం నడిచినా, షుగర్ తో బాధ పడేవాళ్లలో ఎక్కువగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. పాదాలను గోరువెచ్చని నీటిలో ముంచి తీయడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker