Covid Vaccine: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు, క్లారిటీ ఇచ్చిన ICMR.

Covid Vaccine: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు, క్లారిటీ ఇచ్చిన ICMR.
Covid Vaccine: ఆకస్మిక మరణాలపై దేశంలోని వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేశాయని.. కరోనా వ్యాక్సిన్‌తో వీటికి ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదని తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఐసీఎంఆర్, నేషనల్ సెంటరహ్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా తమ అధ్యయనంలో దీనిని ధ్రువీకరించాయి. ఈ మరణాలకు, కరోనా వ్యాక్సిన్లకు ఎటువంటి సంబంధం లేదని తమ అధ్యయనంలో స్పష్టం చేశాయి. అయితే ఈ మరణాలకు ప్రధాన కారణం బ్యాడ్ లైఫ్‌స్టైల్, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణం.

దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఏజేన్సీలు ఈ పరిశోధనలో పాల్గొన్నాయి. ఈ నివేధికల్లో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ ఆకస్మిక మరణాలు కారణం అవుతాయి. ప్రధానంగా ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్ట్ వల్ల చాలామంది చనిపోయిన ఘటనలు జరిగాయి. ఈ వయస్సులోనే మరణాలు..ప్రధానంగా ఈ మరణాలు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో సంభవించాయి. యువత కూడా ఎక్కువ శాతం మరణాల బారిన పడటంతో గత డేటాతోపాటు రియల్ టైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు.
Also Read: చేపలతోపాటు వీటిని కలిపి పొరపాటున అస్సలు కలిపి తినకండి.
2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు ఈ అధ్యయనం చేపట్టారు. ఎక్కువ శాతం ఈ మరణాలు జెనిటిక్ మ్యూటేషన్ వల్ల జరుగుతుందని తెలిపారు. మొత్తంగా ఈ ఆకస్మిక మరణాలు కొవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదని తేల్చేసింది. దీనిపై అపోహాలు తగ్గించుకోవాలని చెప్పారు. ఇదంతా పూర్తి అవాస్తవం తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు. ప్రధానంగా ఈ కొవిడ్ వ్యాక్సిన్ వల్ల చాలామంది ప్రాణాలు నిలిచాయన్న విషయం గుర్తుంచుకోవాలని గుర్తు చేశారు.
Also Read: మీ తెల్ల జుట్టుని ఈ చిట్కాలు ద్వారా 5 నిమిషాల్లోనే నల్లగా మార్చుకోవచు.
గత ఫ్యామిలీ హిస్టరీతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు, సరైన జీవనశైలి అవలంభించకపోవడం ప్రధాన కారణంగా తేల్చాయి. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసి వివిధ దేశాలకు భారత్ సరఫరా చేసింది. ఇందులో కొవాగ్జిన్, కోవీషిల్డ్ ఎక్కువ మొత్తంగా తీసుకున్నవారు ఉన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ 1, వ్యాక్సిన్ 2 తీసుకున్నవారు ఉన్నారు. ఆ తర్వాత బూస్టర్ డోస్ ప్రస్తావన కూడా వచ్చింది. ఎక్కువ మంది ఈ వ్యాక్సిన్ గురించిన అవగాహన లేదు.