క్రెడిట్ కార్డు యుజర్లకి అలెర్ట్, క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ వచ్చాయ్. నిర్లక్ష్యం చేస్తే బాదుడే బాదుడు.
క్రెడిట్, డెబిట్ వంటి పలు కార్డులు ఉంటాయి. అయితే చాలా మంది క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారు. ఈ కార్డును సరైన విధానంలో వినియోగిస్తే మంచిదేనని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అలానే ఈ క్రెడిట్ వినియోగానికి పలు నిబంధనలు ఉంటాయి. ఇవి కూడా తరచూ మారుతు ఉంటాయి. అయితే వాటిని వినియోగించే ప్రతి ఒక్కరూ ఆ క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ఇటీవల చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై నిబంధనలు మార్చాయి. కొన్ని అంశాలను అప్ గ్రేడ్ చేశాయి.
నిర్ధిష్ట లావాదేవీలకు సంబంధించిన వడ్డీ రేట్లు, ఆలస్య రుసుముల విషయంలో కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డు వినియోగదారులు తప్పనిసరిగా ఈ నిబంధనలు గురించి తెలుసుకోవాలి. ఈ నాలుగు బ్యాంకుల్లో క్రెడిట్ కార్డులపై సెట్ చేసిన తాజా రుసుములు, మార్గదర్శకాల గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం..స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్..వచ్చే నెల అంటే జూన్ 21 నుంచి ఈ బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను నిర్వహించే విధానంలో గణనీయమైన మార్పులు ఉండనున్నాయి.
స్విగ్గీ యాప్ లో క్యాష్‌బ్యాక్ స్విగ్గీ మనీగా కనిపించే బదులు, ఈ క్యాష్‌బ్యాక్ ఇప్పుడు నేరుగా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌పై ప్రతిబింబిస్తుంది. అంటే క్యాష్‌బ్యాక్ వచ్చే నెలలో మీ స్టేట్‌మెంట్ బ్యాలెన్స్‌ని తగ్గిస్తుంది. జూన్ 20 వరకు, క్యాష్‌బ్యాక్ మీ స్విగ్గీ యాప్‌లో యథావిధిగా చూపుతుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్..ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సేవలను ఉపయోగించే కస్టమర్‌లకు 1 శాతం రుసుముతో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) యుటిలిటీ బిల్లు సర్‌చార్జి అదనంగా ఉంటుంది. ఒకే బిల్లింగ్ సైకిల్‌లో రూ.20,000 కంటే ఎక్కువ ఉండే యుటిలిటీ బిల్లులను క్రెడిట్ కార్డ్ లపై చేస్తే ఇది వర్తిస్తుంది.
ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్, ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డ్, ఎల్ఐసీ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ లు ఈ యుటిలిటీ సర్‌ఛార్జ్ నుంచి మినహాయింపు పొందుతాయి. ఎస్ బ్యాంక్.. ఈ బ్యాంక్ వారి క్రెడిట్ కార్డ్‌లలో “ప్రైవేట్” రకాన్ని మినహాయించి వివిధ అంశాలను సవరించింది. ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లలో కొన్నింటిలో ఇంధన కొనుగోళ్లకు సంబంధించిన రుసుములకు సర్దుబాట్లు ఉండవచ్చు. వాటిలో వార్షిక రుసుముతో పాటు జాయినింగ్ ఫీజు రద్దు విషయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మినహాయింపునకు అర్హతల విషయంలో మార్పులు ఉండనున్నాయి.
అలాగే ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై యుటిలిటీ బిల్లు చెల్లింపులకు సంభావ్యంగా కొత్త రుసుము ఉండవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా..జూన్ 26 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లపై ఆలస్య చెల్లింపులను మరింత ఖరీదైనదిగా చేసింది. కస్టమర్‌లు చెల్లింపును కోల్పోయినా లేదా చెల్లించాల్సిన కనీస మొత్తం కంటే తక్కువ చెల్లించినా, వారికి ఎక్కువ ఆలస్య రుసుము విధించబడుతుంది. సకాలంలో చెల్లింపులు చేయడానికి, అదనపు ఛార్జీలను నివారించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. చెల్లించని బకాయిలపై వడ్డీ రేటు కూడా నెలకు 3.49 శాతం (ఏటా 41.88 శాతం) నుంచి నెలకు 3.57 శాతానికి (ఏటా 45 శాతం)కు పెంచింది.