News

చిరు, బాలయ్యలతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా..?

సినిమా కెరియర్ ని పక్కన పెడితే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చాలా సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఇక అందులో భాగంగానే ఒక పర్సనల్ ఫంక్షన్ లో ఒకరోజు వీరిద్దరూ కలిసి ఫోటో దిగుతున్నప్పుడు వీళ్ళ పక్కన ఇంకొక బాబు కూడా ఉన్నాడు. అయితే వయసు 50 ఏళ్లు దాటినా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారీ లెజెండరీ యాక్టర్స్. అలాంటిది వీరిద్దరిలో ఏ ఒక్కరితో ఫొటో దిగినా ఎంతో అదృష్టమనుకుంటారు.

అలాంటిది ఏకంగా ఇద్దరు లెజెండరీ నటులతో ఫొటో దిగాడు ఈ బుడ్డోడు. చిరంజీవి, బాలయ్యలను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు. మరి ఈ పిల్లాడు ఎవరో ఈ పాటికే చాలా మంది గుర్తు పట్టే ఉంటారు. యస్. ఈ అబ్బాయి మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ. నందమూరి అభిమానులు మోక్షు సినిమా ఎంట్రీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ ఆశ మాత్రం నెరవేరడం లేదు.

అయితే ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలకృష్ణ తన కుమారుడి సినిమా ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ కు హుషారెత్తే విషయం చెప్పారు. తన కుమారుడి మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని గతంలోనే చెప్పిన బాలయ్య బాబు.. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించారు.‘మా అబ్బాయి మోక్షు కూడా సినిమా పరిశ్రమలోకి రాబోతున్నాడు. అయితే సినిమాల పరంగా తనను ఇన్‌స్పైరింగ్‌గా తీసుకోవద్దని మోక్షుకు చెప్పాను.

సిద్దు జొన్నల గడ్డ, అడివి శేష్, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలను ఇన్ స్పైరింగ్‌గా తీసుకోమని చెబుతుంటాను’ అని ఓపెన్ గా చెప్పేశారు బాలయ్య. ఈ మాటలు విన్న నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరోవైపు సినిమా కోసం మోక్షజ్ఞ ఫిట్ గా తయారవుతున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శీను లేదా, భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావి పూడితో మోక్షు లాంచింగ్ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker