News

విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? అచ్చం హీరోలా ఉన్నాడే..!

80’s, 90’sలో సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ విలన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో చాలావరకు నెగిటివ్ పాత్రలు పోషించినప్పటికీ కమల్ హాసన్, రజినీకాంత్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి హీరోలకు సమానంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే సినిమాల్లో తండ్రిగా, అన్నగా క్యారెక్టర్ రోల్స్ పోషించాడు. అయితే అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది బడా హీరోలకు సరి సమానంగా నటిస్తూ.. గట్టి పోటీనే ఇచ్చాడు రఘువరన్. తండ్రిగా, అన్నగా, విలన్ హా ఇలా దాదాపు 200 కు పైగానే సినిమాలలో నటించి.. ప్రేక్షకులను మెప్పించారు.

నటుడు ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్న క్రమంలోనే.. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా 2008 లో అకస్మాత్తుగా మరణించారు. ఇక ఇప్పుడు అచ్చం తండ్రిని పోలిని రఘువరన్ తనయుడు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1996లో నటి రోహిణి మొల్లేటితో రఘువరన్ వివాహం జరిగింది. వీరికి 1998 ఓ కుమారుడు కూడా జన్మించాడు. అంతా సాఫీగానే సాగిపోతుంది అనుకునే క్రమంలో.. వారిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా 2004 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడిపోయిన తరవాత వారి కుమారుడు తన తల్లితోనే ఉన్నాడు.

అప్పటినుంచి ఇప్పటివరకు వీరికి సంబంధించిన విషయాలు ఏమి బయటకు రాలేదు కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది సెలెబ్రెటీలకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ వైరల్ అవ్వడంతో.. ఇప్పడు రఘువరన్ తనయుడు ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. రఘువరన్ తనయుడి పేరు రిషి వరణ్. ప్రస్తుతం రిషి హైట్ లోను, స్టైల్ లోను.. అచ్చం తన తండ్రిలానే కనిపించడంతో.. తండ్రిలానే ఉన్నాడంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రిషి విషయానికొస్తే.. ఇతను కూడా తల్లిదండ్రులు లానే ఇండస్ట్రీ వైపే అడుగులు వేస్తున్నాడు. అతనికి సంగీతం ఆసక్తి ఉండడంతో ఇప్పటికే పలు ఇంగ్లీష్ ఆల్బమ్స్ ను రిలీజ్ చేశాడు. వాటిలో ఫాదర్ సన్ బారిన్ అనే ఆల్బమ్ బాగా హిట్ అయింది. అయితే మొదట్లో రఘువరన్ కు కూడా సంగీతం అంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ తర్వాతే సినిమాలలోకి వచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు రిషి కూడా ఇలానే ఉండడంతో.. ఇతను కూడా త్వరలో సినిమాలలోకి అరంగేట్రం చేయబోతున్నాడా అనే సందేహాలు అందరికి మొదలయ్యాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker