మరణానికి ముందు మనిషి శరీరంలో కనిపించే మార్పులు ఏంటో తెలుసుకోండి.

మరణం వచ్చే ముందు మన ముఖం అద్దంలో కనిపించదట. నీళ్లలో చూసినా, నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్ని నల్ల రంగులోనే కనిపిస్తాయని, నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు నాలుక పెద్ద సైజులో బయటకు వస్తుందని, చనిపోయే వారికి కచ్చితంగా అది అర్థమవుతుందని చెబుతున్నారు. అంతేకాదు మరణ సంకేతంగా ఎడమ చేయి దానికదే అదురుతుందని చెబుతున్నారు. అయితే అసలు మరణం ఎలా ఉంటుంది? ఎవరికీ తెలీదు. దాన్ని అనుభం కూడా చేయలేరు.
అది చనిపోయిన వారికే తెలుస్తుంది. కానీ వారు చెప్పలేరు. అలాగే కొంత మంది చనిపోయిన వ్యక్తులు కనిపిస్తున్నారని, మాట్లాడతారని చెబుతూంటారు. కానీ అవన్నీ భ్రమలని కొట్టి పడేస్తారు వైద్య నిపుణులు. ఈ విషయం పక్కకు పెడితే.. చనిపోయే ముందు మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయట. అయితే ఇటీవల చనిపోయే స్థితిలో ఉన్నవారిపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు నిపుణులు.
ఆకలి ఉండక పోవడం.. ఒక వ్యక్తి ఒక నెల రోజుల నుంచి సరైన ఆహారం తీసుకోకుండా ఉంటే మాత్రం.. అతను మరణానికి దగ్గరిగా ఉన్నారని సంకేతం కావచ్చు. మరణం సమీపిస్తున్న కొద్దీ వారికి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. క్రమంగా కొన్ని రోజులకు తినడం, మంచి నీరు తాగడం కూడా మానేస్తారు. అతిగా నిద్ర పోవడం.. మరణానికి సంభవించే కొన్ని రోజులకు ముందు ఆ వ్యక్తి ఎక్కువగా నిద్ర పోవచ్చు. ఎందుకంటే వారు సరిగా ఏమీ తినరు. అలాగే జీవ క్రి కూడా బలహీన పడి పోతుంది. దీంతో నిద్ర ఎక్కువగా పడుతుంది.
ఈ సమయంలో వారికి బాగా ఇష్టమైన వ్యక్తుల్ని చూడాలనుకుంటారు. ఎక్కువగా మాట్లాడక పోవడం..మరణిస్తున్న వ్యక్తిలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎనర్జీ లెవల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ మందిలో కూర్చోవడానికి కూడా ఇష్ట పడరు. ఒంటరిగా ఫీల్ అవుతూ.. ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడతారు. కండరాల బలహీనత..మరణానికి సమీపిస్తున్న వ్యక్తులు సరిగా ఆహారం తీసుకోరు. దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోయి శరీరం బలహీనతకు గురవుతుంది. ముఖ్యంగా కండరాలు అనేవి బలహీనంగా మారిపోతాయి.
వారు నిల్చోవడానికి, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న చిన్న అవసరాలకు కూడా మనిషి అవసరం అవుతారు. బ్లడ్ ప్రెజర్ డ్రాప్స్..ఒక వ్యక్తి మరణానికి సమీపిస్తున్నప్పుడు చాలా సంకేతాలు కనిపిస్తాయి. వాటిల్లో శ్వాస ఆడకపోవడం, ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, పల్స్ పడిపోవడం, గుండె రేటు సక్రమంగా పని చేయకపోవడం, శరీర రంగు మారిపోతుంది, మూత్రం రంగు కూడా మారుతుంది. మూత్ర పిండాలు కూడా వైఫల్యం చెందుతాయి. ఇలా అనేక రకాల మార్పులు అనేవి ఎదురవుతూ ఉంటాయి.