Health

ఉసిరికయతో తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మరి దృఢంగా తయారవుతుంది.

చిన్నవయసులోనే తెల్లజుట్టు వల్ల కూడా చాలాసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తెల్ల జుట్టు కారణంగా, క్లాస్‌లో లేదా ఇతర ప్రదేశాలలో స్నేహితులతో ఉన్నప్పుడు చాలా సార్లు జోకులు కూడా వేస్తారు. జుట్టును నల్లగా మార్చుకోవడానికి రకరకాల పద్ధతులను అవలంబిస్తారు. అయితే, మీరు కొన్ని ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా సహజంగా తెల్ల జుట్టును వదిలించుకోవచ్చు. జుట్టును నల్లగా మార్చడంలో హోం రెమెడీస్ చాలా మేలు చేస్తాయి. అయితే పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చాలామందికి జుట్టు నెరుస్తుంటుంది.

అలాగే, నెరిసిన జుట్టును వదిలించుకోవడానికి ప్రజలు జుట్టుకు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్‌ కలర్స్‌ ఉపయోగిస్తుంటారు. కానీ అది తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ సమస్యకు దీర్ఘకాల ఉపశమనం కలిగించాలంటే ఉసిరి కాయను వినియోగించాలి. ఉసిరికాయ జుట్టు సంబంధిత సమస్యలకు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడే లక్షణాలు ఉసిరికాయల్లో పుష్కలంగా ఉంటాయి. ఉసిరిలో మెలనిన్ పిగ్మెంట్‌ను పెంచడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి.

ఈ మెలనిన్ మీ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఉసిరిలో జింక్, విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి. ఇది మీ జుట్టును సహజ పద్ధతుల్లో అందంగా, నల్లగా మారుస్తుంది. అంతేకాకుండా ఇది ఇతర జుట్టు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఉసిరి చుండ్రును తొలగిస్తుంది, రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. జుట్టు సంబంధిత సమస్యల నివారణ కోసం ఉసిరిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు.

మొదటిది, ఉసిరి రసం త్రాగవచ్చు. లేదంటే ఉసిరితో స్వీట్స్‌ తయారు చేసి తినవచ్చు. అలాగే రెండవ మార్గం ఏంటంటే.. జుట్టుకు ఉసిరి రసాన్ని వినియోగించాలి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి ఉసిరికాయను తీసుకోవడం వల్ల జుట్టుకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందనే విషయం మీకు అవగతం అయ్యి ఉంటుంది.

ఉసిరికాయ మీ జుట్టుకు ఇతర మేలు కూడా చేస్తుంది. ఉసిరి మీ జుట్టును బలంగా, మృదువుగా, సిల్కీగా మార్చడంలో సహాయపడుతుంది. చాలా మందికి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది. ఉసిరి ఈ సమస్యను నివారిస్తుంది. ఉసిరి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఉసిరి జుట్టు సంబంధిత అన్ని సమస్యలను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker