News

సినీ పరిశ్రమలో విషాదం. గుండెపోటుతో నాని సినిమా విలన్ కన్నుమూత.

డేనియల్ బాలాజీ.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, చిరుత, నాగ చైతన్య, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో కీలకపాత్రలలో నటించారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో మెయిన్ విలన్ గా నటించారు. తెలుగులో అదే అతడి చివరి సినిమా.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రముఖ కొలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు.. గత రాత్రి గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ కు తరలించే ప్రయత్నంలో ఉండగానే మధ్యలోనే ప్రాణాలను విడిచారు..ఈయన మరణం ఇండస్ట్రీకి తీరన లోటు. ఒక పెద్ద విలన్ ను ఇండస్ట్రీ కోల్పోయింది.

ఈయన తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా విలన్ గా చేశారు.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు.. మొదట సీరియల్ లో నటించిన ఆయన విలన్ గా మారి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు.. ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు.. తమిళ్ లో ఎక్కువ సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker