Health

డయాబెటీస్ పేషెంట్లు బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. అయితే డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధి. ఇది ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలకు కారణమవుతుంది. డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్. ఇది స్వయం ప్రతిరక్షక ప్రతిచర్య వల్ల వస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమంలోని కణాలను నాశనం చేస్తుంది.

ఇక రెండోది టైప్ 2 డయాబెటిస్. ఇది ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా వస్తుంది. దీనిలో శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతుంది. డయాబెటిస్ పేషెంట్లు కొన్ని పండ్లు, ఆహారం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. డయాబెటిస్ పేషెంట్లు బొప్పాయి తినకూడదా..! బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల పండిన బొప్పాయిలో 32 కేలరీలు, 0.6 గ్రాముల ప్రోటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 7.2 గ్రాముల పిండి పదార్థాలు, 2.6 గ్రాముల ప్రోటీన్ లు ఉంటాయి. ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, చక్కెర తక్కువగా ఉంటుంది.

100 గ్రాముల బొప్పాయిలో 6.9 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. ఈ పండు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. బొప్పాయిని గింజలు లేదా విత్తనాలతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అలాగే శరీరానికి శక్తిని అందిస్తాయి. బొప్పాయిలో పాపైన్ ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది ఆహారాన్ని వేగంగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అందుకే ఇది జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకుంటే.. మీ ఆహారంలో సమతుల్య మొత్తంలో బొప్పాయిని చేర్చొచ్చు. బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) 60. దీని అర్థం ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా త్వరగా పెంచదు.

తక్కువ జీఐ ఆహారాలు 20 , 49 మధ్య ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ 50-69 ఉన్న ఆహారాలు మితమైన జీఐ ఆహారాలు. అధిక జిఐ ఆహారాలు 70-100 మధ్య ఉంటాయి. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి మంచిది, డయాబెటిస్ పేషెంట్లు పచ్చి బొప్పాయిని తింటేనే మంచిది. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో షుగర్ తక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కొవ్వు కంటెంట్ తక్కువగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, సోడియం పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ పచ్చి, వండిన బొప్పాయి రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, డయాబెటిస్ ఉన్నవారి మొత్తం ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

బొప్పాయిని ఎంత తినాలి. డయాబెటిక్ పేషెంట్లు రోజుకు ఒక కప్పు కంటే ఎక్కువ బొప్పాయిని తినకూడదు. దీనిలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఇది సహజంగా సేంద్రీయ చక్కెర కంటెంట్ ను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తినకూడదు. తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బొప్పాయిని భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత తింటే మంచిది. మధుమేహులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయాలి, క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనాలి. డాక్టర్ సూచించిన మందులను సకాలంలో తీసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker