Health

రెడ్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు వెంటనే తినేస్తారు.

తమిళనాడులో ఎర్రబియ్యాన్ని మాప్పిళ్లై సాంబ అని అంటారు. మాప్పిళ్లై అంటే అల్లుడని అర్థం. పోషకాలు నిండుగా ఉండే ఈ బియ్యాన్ని అల్లుడికోసం ప్రత్యేకంగా వండిపెడతారు. పీచు, ఇనుము అధికంగా ఉండే ఈ బియ్యంలో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం రెడ్ రైస్. ఈ రైస్ అన్నం నిదానంగా జీర్ణమవుతుంది. అయితే భారతదేశంలో ఎక్కువ మంది రైస్ నే ఎక్కువగా తింటారు. అది కూడా వైట్ రైస్. నిజం చెప్పాలంటే వైట్ రైస్ లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కడుపు నిండటం తప్ప మరే ప్రయోజనాలు ఎక్కువగా ఉండవు.

అందులోనూ వైట్ రైస్ ను ఎక్కువగా తింటే బరువు పెరగడం, ఊబకాయంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వైట్ రైస్ కు బదులుగా రెడ్ రైస్ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. రెడ్ రైస్ లో విటమిన్లు, ఫైబర్ తో పాటుగా ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి. రెడ్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే మన శరీరానికి ఎక్కువగా అవసరమైన థియామిన్, రెబోఫ్లేవిన్, నియాసిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఈ రెడ్ రైస్ లో పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలోని ఫైబర్స్ రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను నియంత్రిస్తాయి.

వీటితో పాటు రెడ్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ రోగులకు ఎర్ర బియ్యం మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు వైట్ రైస్ ను మితంగా మాత్రమే తినాలి. రెడ్ రైస్ లో ఫైబర్ పుష్కలంగా ఉండి కొవ్వు ఉండదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వీటిని డైట్ లో చేర్చుకోవచ్చు. ఎర్ర బియ్యం మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడతాయి. నీటిలో కరిగిపోని ఫైబర్లు కూడా వీటిలో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణ కోసం, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం కోసం రెడ్ ను తినొచ్చు. ఎర్ర బియ్యం విటమిన్లు, ఖనిజాల భాండాగారం. వీటిలో విటమిన్ బి6, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి.

అలాగే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. ఎర్ర బియ్యంలో గ్లూటెన్ అస్సలు ఉండదు. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఎర్ర బియ్యం మెగ్నీషియానికి అద్భుతమైన మూలం. అందుకే ఇది శ్వాస సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ బియ్యం మీ శరీరంలో ఆక్సిజన్ వినియోగం, ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆస్తమాను మెరుగ్గా నిర్వహించడంలో రెడ్ రైస్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

రెడ్ రైస్‌లో కాల్షియం , మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు. ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముక సంబంధిత వ్యాధులను నివారించడానికి రెడ్ రైస్ ఎంతో సహాయపడుతుంది. ఎర్ర బియ్యం కరిగే, కరగని ఫైబర్ కు గొప్ప వనరు. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. ఫైబర్ అతిసారం, మలబద్ధకం రెండింటినీ పోగొడుతుంది. రెడ్ రైస్ మీకు తొందరగా ఆకలి కానీయదు. ఎందుకంటే దీన్ని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అంతేకాదు ఇది మీ జీర్ణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు రెడ్ రైస్ మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర బియ్యంలో కొవ్వు మొత్తమే ఉండదు. అందుకే ఇది ఆకలిని తగ్గిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker