షుగర్ వ్యాధి ఉన్నవారు అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

అరటి పండ్లను తీసుకుంటే.. గుండె జబ్బుల తోపాటుగా పలు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చ అని అంటారు. వాటి ధర కూడా తక్కువే ఉంటుంది. అయితే అతిగా ఏది తిన్నా కూడా సమస్యే. మోతాదుకు మించి.. అరటి పండ్లు తింటే.. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అనేక పోషకాహారం కలిగిన గుణాలను కలిగి ఉన్న వీటిని తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాల్లో అరటిపండ్లు ముఖ్యమైనవి. వీటిల్లో కార్బోహైడ్రేట్లు, సహాజ చక్కెరలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అరటిపండ్లలోని గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
అరటిపండ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తాయి. అందువల్లన మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అరటిపండ్లలోని వివిధ పోషకాలు రక్తంలో చక్కెరపై వివిధ ప్రభావాలను చూపుతాయి. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఒక మధ్యస్థ అరటిపండులో 29 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఒక మధ్యస్థ అరటిపండు 3 గ్రాముల ఫైబర్ కంటెట్‌ను అందిస్తుంది.
అరటిపండ్లు పండినప్పుడు వాటిల్లో చక్కెర శాతం పెరుగుతుంది. పూర్తిగా పండిన అరటిపండ్లు అధిక GIని కలిగి ఉంటాయి. ఇది ఆకుపచ్చ, తక్కువ పండిన అరటిపండ్ల కంటే రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా పండిన అరటిపండ్లను కాకుండా ఆకుపచ్చ లేదా కొద్దిగా పండిన అరటిపండ్లను తినవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు అరటిపండ్లు తినాలనుకుంటే చిన్న అరటిపండ్లను ఎంచుకోవాలి. పెద్ద అరటిపండ్లు తినడం అంటే కార్బోహైడ్రేట్లు, చక్కెరను ఎక్కువగా తీసుకోవడంతో సమానం. రక్తంలో చక్కెర స్థాయిలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల చిన్న అరటిపండ్లు తింటే తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు అందుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు అరటిపండ్లు సురక్షితమేనా..? నిజానికి.. అరటిపండు తినడం వల్ల డయాబెటిక్ రోగులకు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరటిపండులో పొటాషియం, ఫైబర్ వంటి గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం ద్రవ సమతుల్యతను, రక్తపోటును నియంత్రిస్తుంది. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆకుపచ్చ అరటిపండ్లలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులలో బ్లడ్ షుగర్ నిర్వహణలో సహాయపడుతుంది.
అరటిపండ్లు తినడం వల్ల డయాబెటిక్ రోగులకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అరటిపండులో చక్కెర ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తింటే, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లు, ఇతర ఆహారాలలో చక్కెర తీసుకోవడం తగ్గించుకోవాలి. అరటిపండు అలెర్జీ చాలా అరుదు అయినప్పటికీ.. కొంతమందికి వీటిని తినడం వల్ల అలెర్జీ వస్తుంది. అందువల్ల ఆస్తమా, అటోపిక్ డెర్మటైటిస్ మొదలైన అలర్జీలతో బాధపడేవారు అరటి పండ్లు తింటే దురద, వాపు, శ్వాస సమస్యలు వస్తాయి. డయాబెటిస్ తో బాధపడేవారు వైద్యుల సలహా, సూచనల మేరకు అరటి పండ్లు తినడం మంచిది.