Divorce:విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్, భర్తతో మనస్పర్థలు, వేరు కాపురం. అసలు సంగతేంటంటే..!

Divorce:విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్, భర్తతో మనస్పర్థలు, వేరు కాపురం. అసలు సంగతేంటంటే..!
Divorce: హన్సిక 1991 ఆగస్టు 9 తేదీన సింధ్ కుటుంబంలో పుట్టారు. ఆమె నాన్న ప్రముఖ వ్యాపారవేత్త. ఈమె తెలుగు, తమిళ ఎన్నో చిత్రాల్లో నటించారు. అయితే ఆమె హిందీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేశారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వరుడికి అప్పటికే పెళ్లై పోయి విడాకులు తీసుకున్నప్పటికీ తన మనసుకు నచ్చడంతో మను వాడింది.

పెళ్లైన కొత్తలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. హనీమూన్, వెకేషన్లు, టూర్లు అంటూ దేశ, విదేశాలు తిరిగొచ్చారు. ఈ ఆలుమగల ఫొటోలు కూడా అప్పట్లో నెట్టింట బాగా వైరలయ్యాయి. అలాంటిది.. ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దంపతులు గత రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: కోట శ్రీనివాసరావు ఆస్తులు విలువ తెలుసా..?
స్టార్ హీరోయిన్ తన తల్లితో ఉంటే.. భర్త తన పేరెంట్స్ తో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే విడాకుల రూమర్స్ గురించి సోహైల్ స్పందించాడు. తమపై జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేల్చిపారేశాడు. అదే సమయంలో తాము వేర్వేరుగా జీవిస్తున్నారన్న అంశంపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా గతంలో హన్సిక తన భర్తతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం, వెంటనే ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దవుతుంది.
అయితే ఈ మధ్యన సింగిల్ గా ఉన్న ఫొటోలు మాత్రమే పంచుకుంటోంది. ఇక ప్రతి ఏడాది పెళ్లిరోజున స్పెషల్ ఫోటోలు షేర్ చేసేది హన్సిక. గతేడాది డిసెంబర్‌లో కూడా సెకండ్ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్ పెట్టిందీ అందాల తార. మరి ఇంత కలివిడిగా ఉన్న ఈ ఆలుమగలు ఎందుకు విడిగా ఉంటున్నారు? లేదా లేనిపోని రూమర్లు సృష్టిస్తున్నారా? అనే విషయంపై హన్సిక స్పందించాల్సి ఉంది.