Health

ఈ కాలంలో దోమల వల్ల ఎన్ని వ్యాధులొస్తాయో తెలుసా..?

వర్షాకాలంలో వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి అధికంగా ఉంటుంది. దోమ కాటు వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, జికా వైరస్, వెస్ట్ వైరస్ తో పాటు అనేక అంటు వ్యాధులు వస్తాయి. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు చేరి ఉండటం వల్ల దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. అయితే మలేరియా, డెంగ్యూలతో పాటుగా దోమలు ఎన్నో ఇతర వ్యాధుల బారిన కూడా పడేస్తాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తున్నాయి. మలేరియా..ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేసే.. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఇది ప్లాస్మోడియం జాతికి చెందిన ఏకకణ పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్నజీవి సాధారణంగా దోమ కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది.

జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, ఫ్లూ లు మలేరియా లక్షణాలు. కొన్ని సందర్భాల్లో ఇది శ్వాసకోశ సమస్యలు,అవయవ వైఫల్యం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. దీనికి చికిత్స చేయకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. దీనిని నివారించడానికి బెడ్ నెట్స్, ఇండోర్ స్ప్రేయింగ్, యాంటీ మలేరియా మందులను ఉపయోగించాలి. డెంగ్యూ..డెంగ్యూను ఈడిస్ దోమ కాటు వల్ల వస్తుంది. ఈ దోమ ఎక్కువగా నిర్మాణ ప్రదేశాలు, నీటి ట్యాంకులు, స్విమ్మింగ్ పూల్స్, మొక్కలు, చాలా కాలంగా క్లీన్ చేయకుండా వదిలేసిన చెత్తలో, వాడకుండా ఉన్న నీటి వనరుల్లో సంతానోత్పత్తి చేస్తుంది. ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు విపరీతమైన జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, కళ్లలో అసౌకర్యం, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం, జ్వరం లేదా షాక్ సిండ్రోమ్ లు డెంగ్యూ లక్షణాలు.

డెంగ్యూ బారిన పడిన వారికి మళ్లీ తీవ్రమైన డెంగ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ప్రాణాంతకం కావొచ్చు. చికున్ గున్యా.. చికున్ గున్యా వైరస్ ను ఈడిస్ ఈజిప్టి దోమలు మనకు వ్యాపింపజేస్తాయి. జ్వరం, కీళ్ల అసౌకర్యం, వాపు, కండరాల నొప్పి, తలనొప్పి, దద్దుర్లు చికున్ గున్యా లక్షణాలు. చికెన్ గున్యా సోకిన వ్యక్తి వారం రోజుల్లోనే కోలుకుంటారని, కానీ అరుదుగా ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల అసౌకర్యం నెలలు లేదా సంవత్సరాలు కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జికా వైరస్..ఈడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ పుట్టుకతో వచ్చే లోపాలు, నాడీ సంబంధిత రుగ్మతలు వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker