Health

దోమలు కొందరినే ఎక్కువగా కుడుతూ ఉంటాయి. దాని రహస్యం ఏంటో తెలుసా..?

చాలా మంది ఇండ్లల్లో దోమల బెడద ఉంటుంది. వర్షకాలం వచ్చిందంటే దోమలు ఎక్కువవుతాయి. మలేరియా, డెంగ్యూ,ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, చికున్‌గన్యా, జికా తదితర వైరల్‌ ఫీవర్స్ ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే దోమలు కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అయితే మనలో చాలా మంది దోమలు తమనే ఎక్కువగా ఎందుకు కుడతాయని ప్రశ్నించుకుంటారు. అయితే ఈ విషయంలో దోమలకేమి పక్షపాతం ఉండదు.

కానీ దీని వెనుక సైన్సు ఉందంటారు కొందరు. మనకు నచ్చిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నట్లే… దోమలు కూడా వాటికి నచ్చిన తిండిని ఎంచుకుంటాయి. దోమలు కుట్టడానికి కారణం.. రక్తం.. దోమలకు రక్తమంటే చాలా ఇష్టమని చాలా మంది చెబుతారు. అందులో కొంత వాస్తవం ఉంది. దోమలు కొన్ని రక్త వర్గాలకు చెందిన వారిని కుట్టడానికే ఇష్టపడతాయి.

ముఖ్యంగా దోమలు ‘’O’ బ్లడ్ గ్రూప్’ వర్గానికి చెందిన వారినే ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వాసన.. శరీర వాసనకు కూడా దోమలు ఆకర్షితులవుతాయి. అంటే పెర్ఫ్యూమ్ వాడేవారిని దోమలు కుట్టవని అర్థం కాదు. శరీర చెమట అమ్మోనియా మరియు లాక్టిక్ యాసిడ్ వంటి అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉంటుంది, ఇది దోమలను విపరీతంగా ఆకర్షిస్తుంది.

బాక్టీరియా.. బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న చోట దోమలు ఎక్కువగా ఉంటాయి. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. ఒక పరిశోధన ప్రకారం, దోమలు మన పాదాలను ఎక్కువగా కుడతాయి, ఎందుకంటే పాదాలలో బ్యాక్టీరియా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్.. దోమలు కార్బన్ డయాక్సైడ్ కు ఎట్రాక్ట్ అవుతాయి.

ఎక్కువ సేపు ఊపిరి పీల్చుకుంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుట్టడానికి ఇష్టపడతాయి. జీవక్రియ రేటు.. మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. గర్భిణీ స్త్రీలు అధిక జీవక్రియ రేటును కలిగి ఉంటారు, కాబట్టి వారు దోమ కాటుకు గురవుతారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker