Health

ఈ కాలంలో ఈ చిట్కాలు పాటిస్తే మీ పేగు మొత్తం క్లీన్ అయ్యి ఆరోగ్యంగా ఉంటారు.

పేగు కదలికలలో ఏదైనా.. సమస్య ఉంటే పేగులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మనం తీసుకునే ఆహారం కారణంగా, పేగులలో.. చెత్త పెరుకుపోయిని ఉంటే, అవి సక్రమం పనిచేయలేవు. వీటి కారణంగా పేగులో వాపు, పూతతో పాటు పుండ్లు వేధస్తాయి. జీర్ణవ్యవస్థలో లోపాలు ఉంటే.. రోగనిరోధక శక్తి బలహీనంగా తయారవుతుంది. అయితే ఈ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా సర్వసాధారణం.

అందువల్ల వర్షాకాలంలో మీరు జబ్బు పడకుండా ఉండాలన్నా లేదా అనారోగ్యాల నుంచి వేగంగా కోలుకోవాలన్నా, మీకు బలమైన రోగనిరోధక శక్తి అవసరం. మీ శరీరంలోని బలమైన రోగనిరోధక శక్తి చాలా ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోండి. వండిన ఆహారాన్ని తినండి.. మాన్సూన్‌లో పచ్చి ఆహారాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి జీర్ణశయ ఇన్‌ఫెక్షన్లను పెంచే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో హానికర సూక్ష్మజీవుల వృద్ధి పెరుగుతుంది కాబట్టి పచ్చిగా తినడం కంటే బాగా వండిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. బాగా వండితే అందులోని సూక్ష్మజీవులు నశిస్తాయి.

స్టైర్ ఫ్రై వెజిటేబుల్స్, సూప్‌లు, ఉడికించిన కూరలు , ఆవిరిలో వండిన కూరగాయలను తీసుకోండి, మరోవైపు పచ్చి ఆహారాలు కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, ఇతర అనారోగ్యాలను కలిగిస్తాయి. పచ్చి సలాడ్‌లను మితంగా తీసుకోండి. పండ్లనుతినడానికి ముందు బాగా కడగండి,యాపిల్, పియర్ వంటి పీచు పండ్లు వంటి గుజ్జు కలిగిన పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. హెర్బల్ టీలు తాగండి.. తులసి, మిరియాలు, పసుపు, లెమన్ గ్రాస్, అల్లం మొదలైన మూలికలను ఉపయోగించి తయారు చేసే హెర్బల్ టీలను తాగండి, ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

మీరు రుచిని ఆస్వాదించాలనుకుంటే టీలలో దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి వంటి మసాలా దినుసులు జోడించండి, ఇవి రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఆహారంలో ప్రోబయోటిక్స్ చేర్చండి.. వర్షాకాలం పేగులను బలహీనపరుస్తుంది కాబట్టి ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా వాటి పనితీరు పెంచడం చాలా ముఖ్యం. ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మజ్జిగలో ఇంగువ, నల్ల ఉప్పు, సౌర్‌క్రాట్ వేసి తీసుకోవడం, ఇతర పులియబెట్టిన కూరగాయలు తీసుకుంటే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీరు తినే ప్రతి భోజనంలో కొంత ప్రోటీన్ మూలం ఉండేలా చూసుకోండి – రోగనిరోధక వ్యవస్థలో ప్రోటీన్లు ఒక భాగమైనందున రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పప్పులు, పెరుగు, గింజలు లేదా పరిమితంగా నాన్-వెజ్ ఆహారాలు తీసుకోండి. అల్పాహారంలో పెరుగు, గింజలు లేదా ఓట్స్‌ను పాలతో తినండి. మధ్యాహ్న భోజనంలో పప్పులు, చిక్కుళ్ళు , తృణధాన్యాలు చేర్చవచ్చు. రాత్రి భోజనంలో ప్రోటీన్ మూలంగా ఉండే పెరుగు లేదా చికెన్ వంటి నాన్-వెజ్ ఆహారాలు తీసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker